ఎంటర్‌టైనింగ్‌గా ‘ప్రతీరోజూ పండగే’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!
సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ‘ప్రతీరోజూ పండగే’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వేదికగా.. గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో వస్తుండగా.. మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో.. సాయిధరమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు మారుతీ. కాగా.. ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్యలక్ష్మి, రావు రమేష్, హరితేజ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ […]

సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ‘ప్రతీరోజూ పండగే’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వేదికగా.. గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో వస్తుండగా.. మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో.. సాయిధరమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు మారుతీ. కాగా.. ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్యలక్ష్మి, రావు రమేష్, హరితేజ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
కాగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. సినిమాలోని నటీనటులు అందరూ డ్యాన్స్‌లతో హంగామా చేశారు. ముఖ్యంగా అల్లు అరవింద్ కూడా.. డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహ పరిచారు. చిత్రలహరి సినిమా తరువాత తేజ్ చేస్తోన్న చిత్రమిది. కాగా.. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, ఫొటోలు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందు రాబోతుంది.