నిద్రలేక ఫ్రస్ట్రేషన్‌తో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!

ఓ వ్యక్తికి 12 రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌తో ఆత్మహత్యకు యత్నించాడు. కంటిమీద కునుకు లేకపోవడంతో.. ఓ వ్యక్తి నరక యాతన అనుభించాడు. అతని బాధను చూసి కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ హాస్పటిల్‌లో కూడా నిద్ర పట్టకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాక మూడో అంతస్తు నుంచి కిందకు జంప్ చేశాడు. కానీ.. భూమి మీద ఇంకా నూకలు ఉండటంతో.. బతికిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతూల్లో చోటు చేసుకుంది. ఇతని […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:51 pm, Sun, 15 December 19
నిద్రలేక ఫ్రస్ట్రేషన్‌తో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!

ఓ వ్యక్తికి 12 రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌తో ఆత్మహత్యకు యత్నించాడు. కంటిమీద కునుకు లేకపోవడంతో.. ఓ వ్యక్తి నరక యాతన అనుభించాడు. అతని బాధను చూసి కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ హాస్పటిల్‌లో కూడా నిద్ర పట్టకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాక మూడో అంతస్తు నుంచి కిందకు జంప్ చేశాడు. కానీ.. భూమి మీద ఇంకా నూకలు ఉండటంతో.. బతికిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతూల్లో చోటు చేసుకుంది.

ఇతని పేరు మదన్ సింగ్. మూడో అంతస్తు నుంచి కిందకు దూకుతున్న సమయంలో.. పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వలను ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఇతను దూకుతున్న విషయాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. కాగా.. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారింది.