సాయిబాబాకీ.. వైసీపీ రంగులు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఎక్కడ చూసినా.. వైసీపీ జెండా రంగులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలకు, స్మశానాలకు, గాంధీజీ విగ్రహానికీ వైసీపీ రంగులు వేయగా.. మొన్న ఆఖరికి ఎవరో.. గేదె కొమ్ములకు కూడా రంగులు వేసిన వార్తలను చూశాము. కానీ.. ఇప్పుడు దేవుడికి కూడా.. ఈ రంగులు అంటుకున్నాయి. ఏంటి దేవుడికి పెయింట్ వేశారా అని ఆశ్చర్యపోకండి..! వైసీపీ రంగులున్న ఓ శాలువాని.. సాయిబాబాకి అలంకరించారు. ఇప్పుడు ఈ ఫొటో.. అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:31 pm, Fri, 29 November 19
సాయిబాబాకీ.. వైసీపీ రంగులు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఎక్కడ చూసినా.. వైసీపీ జెండా రంగులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలకు, స్మశానాలకు, గాంధీజీ విగ్రహానికీ వైసీపీ రంగులు వేయగా.. మొన్న ఆఖరికి ఎవరో.. గేదె కొమ్ములకు కూడా రంగులు వేసిన వార్తలను చూశాము. కానీ.. ఇప్పుడు దేవుడికి కూడా.. ఈ రంగులు అంటుకున్నాయి. ఏంటి దేవుడికి పెయింట్ వేశారా అని ఆశ్చర్యపోకండి..! వైసీపీ రంగులున్న ఓ శాలువాని.. సాయిబాబాకి అలంకరించారు. ఇప్పుడు ఈ ఫొటో.. అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో.. బాబా విగ్రహానికి వైసీపీ శాలువా కప్పడం.. ఆ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. బాబాకు 8 రోజుల క్రితం ఓ భక్తురాలు ఈ శాలువాను సమర్పించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. అయితే.. వైసీపీ పార్టీ రంగులకు.. ఈ శాలువాకి రంగుల్లో తేడా ఉందని.. కానీ.. అభ్యంతరాలు రావడంతో.. వెంటనే ఈ శాలువాని తొలగించినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా.. ఇది కావాలని చేశారో.. లేక తెలిసీ తెలియక చేశారో కానీ.. ప్రస్తుతం ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది.