Saaho Review: వీళ్లేంటి.. ఇలా మాట్లాడారు సాహో..?

రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూసిన టైం వచ్చేసింది. ప్రభాస్ నటించిన ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఉమైర్ సందూ ఇచ్చాడు. ఈ రోజు చూసిన కొంతమంది తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇక చాలామంది నెగటివ్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు. సినిమా మొదటి […]

Saaho Review: వీళ్లేంటి.. ఇలా మాట్లాడారు సాహో..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 30, 2019 | 8:40 AM

రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూసిన టైం వచ్చేసింది. ప్రభాస్ నటించిన ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఉమైర్ సందూ ఇచ్చాడు. ఈ రోజు చూసిన కొంతమంది తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇక చాలామంది నెగటివ్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు. సినిమా మొదటి భాగం ఏవరేజ్ అని.. రెండో భాగం మాత్రం చాలా బాగుందని అంటున్నారు. ప్రభాస్ ఎంట్రీ.. ఇంటర్వెల్ 20 మినిట్స్.. క్లైమాక్స్ 30 నిమిషాలు అద్భుతంగా ఉందని చెప్పగా.. సాంగ్స్, రొటీన్ స్టోరీ లైన్, లెంగ్తీ రన్ టైం.. సినిమాకు మైనస్ అని అన్నారు. ఇలా కొంతమంది ప్రభాస్ సాహో సూపర్ హిట్ అని.. మరి కొంతమంది చెప్పినంత రేంజ్‌లో లేదని అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ నటించిన సాహో హిట్ అయిందా..? లేదా..? అనేది తెలియాలంటే ఈ వారం ఆగాల్సిందే..