కరోనా వైరస్ వ్యాక్సీన్ ఉత్పత్తిలో మేమే ఫస్ట్, రష్యా

కరోనా వైరస్ కోవిడ్ 19 వ్యాక్సీన్ తొలి విడతను రష్యా ఉత్పత్తి చేసింది. మొదటి దఫా వ్యాక్సీన్ ప్రొడక్షన్ ప్రారంభమైందని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మాసాంతం నుంచి ఇది మార్కెట్ లోకి వచ్ఛే అవకాశాలు..

కరోనా వైరస్ వ్యాక్సీన్ ఉత్పత్తిలో మేమే ఫస్ట్, రష్యా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 15, 2020 | 8:24 PM

కరోనా వైరస్ కోవిడ్ 19 వ్యాక్సీన్ తొలి విడతను రష్యా ఉత్పత్తి చేసింది. మొదటి దఫా వ్యాక్సీన్ ప్రొడక్షన్ ప్రారంభమైందని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మాసాంతం నుంచి ఇది మార్కెట్ లోకి వచ్ఛే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే మూడో దశ ట్రయల్స్ గురించి గానీ, వలంటీర్ల గురించి గానీ ఈ దేశం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అధ్యక్షుడు పుతిన్.. ఈ వ్యాక్సీన్ ని తన కూతురికి స్వయంగా ఇచ్చామని, ఆమెలో యాంటీ బాడీలు పెరిగాయని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఇటీవల ప్రకటించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఈ వ్యాక్సీన్ కి ఆమోదం తెలిపిందా లేదా అన్నది తెలియడంలేదు.

ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కూడా.. దీని సేఫ్టీపై వారు అనుమానాలు ప్రకటిస్తున్నారు. కానీ వీటి గురించి పట్టించుకోకుండా రష్యా తనదారిన తాను పోతోంది. ఈ వ్యాక్సీన్ ని తాము కొంటామని వియత్నాం తాజాగా ప్రకటించింది.