కిసాన్ కార్డు దారులకు రూ.25 వేల కోట్ల రుణాలు..

సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నామని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి వివరాలను ఆర్ధికమంత్రి వివరిస్తున్నారు. సన్నకారు

కిసాన్ కార్డు దారులకు రూ.25 వేల కోట్ల రుణాలు..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 5:06 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నామని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి వివరాలను ఆర్ధికమంత్రి వివరిస్తున్నారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాం. కిసాన్ కార్డు దారులకు రూ. వేల కోట్ల రుణాలు ఇస్తామని ఆమె వివరించారు. రైతులు, పేదలు, వలసదారులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. విసికోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు.

కాగా.. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ. 11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణి చేశాం. పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12 వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ అందించాం. అని నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకోసం రూ. 4200 కోట్లు కేటాయించాము. ఉపాధి హామీ పథకం కింద 10 వేల కోట్లు ఇప్పటికే బట్వాడా చేశామని తెలిపారు. దేశమంతా ఒకటే కనీస వేతనం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.