కరోనా ఎఫెక్ట్: జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే ఈ మహమ్మారికి సంబంధించి వార్తల సేకరణలో ఉన్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం

కరోనా ఎఫెక్ట్: జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 7:05 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే ఈ మహమ్మారికి సంబంధించి వార్తల సేకరణలో ఉన్న జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లోనూ విధులు నిర్వర్తిస్తున్న కొందరు జర్నలిస్టులు వైరస్ బారిన పడినట్టు వార్తలు రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.

కాగా.. ముంబైలో 50 మంది, చెన్నైలో దాదాపు 20 మంది జర్నలిస్టులు ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీడియా ప్రతినిధులకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కోవిడ్ టెస్టింగ్ సెంటర్‌లో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

[svt-event date=”23/04/2020,6:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Latest Articles