చాహల్ ఫన్నీ డ్యాన్స్ వీడియో, సోషల్ మీడియాలో వైరల్
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఫన్నీ చేష్టలతో సోషల్ మీడియలో నెటిజన్లను అలరిస్తుంటాడు. ఈ ఐపీఎల్ లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే.
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఫన్నీ చేష్టలతో సోషల్ మీడియలో నెటిజన్లను అలరిస్తుంటాడు. ఈ ఐపీఎల్ లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ వేదికగా నవ్వులు పూయించడం ప్రారంభించాడు ఈ స్పిన్నర్. తన జట్టులోని సహచర ఆటగాడు క్రిస్ మోరిస్‌తో కలిసి ఫన్నీ డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల తన ప్రియురాలు, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు చాహల్. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం కఠోర సాధన చేస్తున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. ఈ జట్టు తన ఫస్ట్ మ్యాచ్‌లో సెప్టెంబరు 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
Also Read :
ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!