వర్శిటీ విద్యార్థులపై రాయల్ టైగర్ దాడి… పులి కోసం వెతుకుతున్న ఫారెస్ట్ అధికారులు

అసోం గ్రామాల్లో ఇంకా టైగర్‌ టెన్షన్‌ కొనసాగుతోంది.. ఎప్పుడు పులి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. నిన్న జనావాసాల్లోకి వచ్చిన పులి..స్థానికులపై దాడి చేసింది. తేజ్‌పుర్‌ యూనివర్శిటీ సమీపంలో గ్రామస్తులపై పంజా విసిరింది.

వర్శిటీ విద్యార్థులపై రాయల్ టైగర్ దాడి... పులి కోసం వెతుకుతున్న ఫారెస్ట్ అధికారులు

Updated on: Nov 25, 2020 | 9:43 AM

Royal Bengal tiger attacked : అసోం గ్రామాల్లో ఇంకా టైగర్‌ టెన్షన్‌ కొనసాగుతోంది.. ఎప్పుడు పులి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. నిన్న జనావాసాల్లోకి వచ్చిన పులి..స్థానికులపై దాడి చేసింది. తేజ్‌పుర్‌ యూనివర్శిటీ సమీపంలో గ్రామస్తులపై పంజా విసిరింది.

వర్శిటీ వైపు నుంచి వెళ్తున్న విద్యార్ధులపై దాడి చేసింది. దీంతో జనం పరుగులు పెట్టడంతో వారిని పులి వెంటాడింది. అయితే పులి దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా జనావాసాల్లోకి రాయల్ టైగర్ పులులు దాడు చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. టైగర్‌ను బంధించి కజిరంగా జాతీయపార్కులోకి తరలించేందుకు యత్నిస్తున్నారు.