ప్రతి ఇంట్లో ఉండవలసి మొక్క ఇది.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది.. లాభాలు తెలిస్తే వావ్..
రోజ్మెరీ ఒక సుగంధభరితమైన హెర్బల్ మొక్క మాత్రమే కాదు, అనేక ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలను అందించే సహజ వరం. ముఖ్యంగా రోజ్మెరీ ఆయిల్, రోజ్మెరీ వాటర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు చుండ్రు, స్కాల్ప్ దురద సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రోజ్మెరీ ఆకులతో హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు.

రోజ్మెరీ.. ఒక సుగంధభరితమైన హెర్బల్ ప్లాంట్.. ఈ మధ్య కాలంలో దాని అద్భుతమైన ప్రయోజనాల వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. దీని పేరు వినగానే చాలా మందికి రోజ్మెరీ ఆయిల్ లేదా రోజ్మెరీ వాటర్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు గుర్తుకు వస్తాయి. నిజానికి, ఈ మొక్క కేవలం జుట్టు ఆరోగ్యానికే కాకుండా, అనేక ఇతర రంగాలలో కూడా అద్భుతమైన ఉపయోగాలు అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తొలుత దీని సువాసనతో ఆకర్షితులై కొందరు ఈ మొక్కను ఇంటికి తెచ్చుకుంటారు. చేత్తో పట్టుకొని నలిపినప్పుడు వెలువడే సువాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కానీ, ఇది కేవలం సుగంధ మొక్క మాత్రమే కాదు.. కొన్ని దేశాలలో దీన్ని పుదీనాలాగా వంటల్లో, ముఖ్యంగా నాన్-వెజ్ రెసిపీస్‌లో విరివిగా ఉపయోగిస్తారు. రోజ్మెరీతో హెర్బల్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. దీని సువాసనను సోపులు, పర్ఫ్యూమ్‌లు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా వినియోగిస్తారు. సరైన వాతావరణ పరిస్థితులలో ఈ మొక్క దాదాపు 30 సంవత్సరాల వరకు జీవించగలదు.
జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది..
రోజ్మెరీ అత్యంత ముఖ్యమైన, పరిశోధనలకు మద్దతు ఉన్న ప్రయోజనం దాని జుట్టు సంరక్షణ సామర్థ్యం. రోజ్మెరీ వాటర్ లేదా ఆయిల్‌ను క్రమం తప్పకుండా తలకు, స్కాల్ప్‌కు అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇది జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడే వారికి, స్కాల్ప్ దురదను తగ్గించడంలో కూడా రోజ్మెరీ సమర్థవంతంగా పనిచేస్తుంది. నిరంతరంగా సుమారు ఆరు నెలల పాటు రోజ్మెరీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం గమనించవచ్చు. ఇది జుట్టు సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
జుట్టు సంరక్షణకు రోజ్మెరీ ఆయిల్ లేదా వాటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎండిన రోజ్మెరీ ఆకులను ఉపయోగించి హెర్బల్ టీ తయారు చేసుకుంటే, అది ఆహ్లాదకరమైన రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నమ్ముతారు. దీని సువాసన వల్ల చాలామంది తమ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ రోజ్మెరీ మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. నర్సరీ వంటి ప్రదేశాలలో ఈ మొక్కలను కొనుగోలు చేయవచ్చు.
మొత్తం మీద, రోజ్మెరీ మొక్క అనేది కేవలం ఒక అలంకరణ మొక్క కాదు.. అది ఇంటి వాతావరణాన్ని మెరుగుపరిచే ఒక హెర్బల్ ప్లాంట్. జుట్టు ఆరోగ్యం నుండి వంటకాల వరకు, సుగంధ ద్రవ్యాల నుండి సౌందర్య ఉత్పత్తుల వరకు ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి ఇంటిలోనూ ఒక రోజ్మెరీ మొక్కను పెంచుకోవడం ద్వారా దాని అద్భుతమైన లాభాలను సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.,
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
