Chicken Curry: మాంసాహార ప్రియులకు (Non Veg food) చికెన్ తో రకరకాల వంటకాలు తయారు చేసుకోవాలి ఉంటుంది. చికెన్ కర్రీ, చికెన్ ప్రై (Chicken Fry), చికెన్ బిర్యానీ (Chicken Boryani), చికెన్ కబాబ్స్ ఇలా రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా చికెన్ కర్రీ రుచికరం గానే ఉంటుంది. ఈరోజు రుచిగా చికెన్ ను తయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
చికెన్ – ఒక కిలో
తరిగిన ఉల్లిపాయలు- 2 (పెద్దవి),
ఎండు మిరపకాయలు – 7,
కరివేపాకు – రెండు రెబ్బలు,
తరిగిన కొత్తిమీర- కొద్దిగా
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్,
జీలకర్ర- అర టీ స్పూన్,
లవంగాలు – 2,
యాలకులు- 2,
దాల్చిన చెక్క – కొద్దిగా,
అల్లం వెల్లులి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్,
కారం – ఒక టీ స్పూన్,
పసుపు – అర టీ స్పూన్,
ఉప్పు – రుచికి సరిపడా,
పెరుగు- ఒక టేబుల్ స్పూన్,
నూనె- కావాల్సినంత
నిమ్మకాయ-1
తయారీ విధానం: ముందుగా చికెన్ ను బాగా కడిగి.. నీరు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చికెన్ లో కొంచెం పెరుగు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మ రసం వేసుకుని కలిపి.. ఆ చికెన్ ను మాగ్నెట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇంతలో చికెన్ మసాలా రెడీ చేసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి.. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తరువాత మిక్సీలో వీటిని వేసుకుని మసాలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దళసరి గిన్నె స్టౌ మీద పెట్టుకుని నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత దానిలో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించిన అనంతరం నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించాలీ. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని ముందుగా మాగ్నెట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని బాగా ఉడికే వరకూ వేయించుకోవాలి. చికెన్ ఉడికిన తరువాత కారంవేసుకుని కొన్ని నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం తగినంత మసాలా, వేసుకుని నూనె తేలేవరకూ స్విమ్ లో పెట్టుకుని ఇడికించుకోవాలి. తర్వాత చికెన్ లో తరిగిన కొత్తిమీరను వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ.. ఇది అన్నం, చపాతీ, పుల్కా ఇలా దేనిలో కలుపుని తినవచ్చు.
Mancherial: అంబులెన్స్‌కు రూ. 80 వేలు లేక.. ప్రభుత్వాస్పత్రిలో అందరూ ఉన్నా అనాథ శవంలా పడి ఉన్న మృత దేహం