క్రికెట్ ప్రియులకు జీయో బంపర్ ఆఫర్

క్రికెట్ ప్రియులకు జీయో బంపర్ ప్రకటించింది. రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది...

క్రికెట్ ప్రియులకు జీయో బంపర్ ఆఫర్
Follow us
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 10:14 PM

క్రికెట్ ప్రియులకు జీయో బంపర్ ప్రకటించింది. రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డేటా ప్యాక్స్ అయిన ఈ ప్లాన్లలో రూ. 399 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా లభించనుంది.

ఇందులో ఒకటి రూ. 499 ప్లాన్ కాగా, మరోటి రూ. 777 క్వార్టర్లీ ప్లాన్. రూ. 499 క్రికెట్ ప్యాక్‌లో అపరిమితంగా క్రికెటింగ్ కవరేజ్ ఉంటుంది. ఇక మరో ప్లాన్ రూ. 399 విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. అలాగే, రోజుకు రూ. 1.5 జీబీ డేటా 56 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇందులో ఎలాంటి వాయిస్, SMS ప్రయోజనాలు లభించవు.

రూ. 777 క్వార్టర్లీ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ VIP సభ్యతం ఏడాది పాటు లభిస్తుంది. ఇందులో వాయిస్, డేటా ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రోజుకు 1.5 జీబీ డేటా లభించనుండగా, ఈ ప్యాక్‌తో ఓవరాల్‌గా అదనంగా 5GB డేటా లభిస్తుంది. ఈ రెండు ప్యాక్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది.