గురువుకు నివాళులు అర్పించిన గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన గురువును స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. తంజావూరులో పేరొందిన ప్రొఫెసర్ డాక్టర్ వంచిలింగమ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులు...

గురువుకు నివాళులు అర్పించిన గవర్నర్
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 24, 2020 | 9:06 PM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన గురువును స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. తంజావూరులో పేరొందిన ప్రొఫెసర్ డాక్టర్ వంచిలింగమ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేసిన గవర్నర్.. ఆయన మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ రోజుల్లో తనకు పాఠాలు చెప్పారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆయన సతీమణి డాక్టర్ వల్లి నాయకి, పిల్లలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.