తెలుగు రాష్ట్రాల్లో ‘జియో మార్ట్’ సేవలు.. ఎక్కడెక్కడంటే.?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ప్రజలకు కిరాణా, నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్ రిటైల్ 'జియో మార్ట్' సేవలను విప్లవాత్మకంగా ప్రారంభించింది.

తెలుగు రాష్ట్రాల్లో జియో మార్ట్ సేవలు.. ఎక్కడెక్కడంటే.?

Updated on: Jun 07, 2020 | 1:52 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ప్రజలకు కిరాణా, నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్ రిటైల్ ‘జియో మార్ట్’ సేవలను విప్లవాత్మకంగా ప్రారంభించింది. ‘ఎక్స్టెండెడ్ బీటా వెర్షన్’ కింద రెండు రాష్ట్రాలలోని సుమారు 30 నగరాల్లో జియోమార్ట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, సిద్ధిపేట, బోధన్, పాల్వంచ, మిర్యాలగూడ, మెదక్, సంగారెడ్డి

ఆంధ్రప్రదేశ్: విజయవాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, తాడేపల్లిగూడెం, విజయనగరం, నరసరావుపేట, భీమవరం, కర్నూలు, తణుకు, వినుకొండ, ఉయ్యూరు, అనంతపురం, కాకినాడ.

ఈ 30 నగరాల్లో ప్రజలు కిరాణా సరుకులను జియోమార్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా తెప్పించుకోవచ్చు. తన వినియోగదారులకు ఎంఆర్‌పీ కంటే 5 శాతం తక్కువ ధరకే జియోమార్ట్ ఉత్పత్తులను అందిస్తుంది. కాగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జియో మార్ట్ సేవలు 200 నగరాలు, పట్టణాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. క్రమక్రమంగా ఈ సంఖ్య పెంచేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: 

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..