కొవిడ్ టెస్ట్‌కు నో చెప్పిన రేఖ.. అందుకేనట !

బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. అలనాటి అందాల నటి రేఖ సైతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. రేఖ బంగ్లా ముందుండే ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్...

  • Sanjay Kasula
  • Publish Date - 9:35 pm, Wed, 15 July 20
కొవిడ్ టెస్ట్‌కు నో చెప్పిన రేఖ.. అందుకేనట !

బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. అలనాటి అందాల నటి రేఖ సైతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. రేఖ బంగ్లా ముందుండే ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. దీంతో రేఖకు కూడా పరీక్షలు చేసేందుకు వెళ్లిన బీఎంసీ అధికారులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించారు. కనీసం బంగ్లాను శానిటైజేషన్ చేసేందుకు కూడా అనుమతించలేదు.

రేఖకు వైద్య పరీక్షలు చేసేందుకు వెళ్లిన బీఎంసీ మెడికల్ ఛీప్ సంజయ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు రేఖ తిరస్కరించారని చెప్పారు. అంతేకాదు తమని లోపలకి కూడా రానివ్వలేదని అన్నారు. రేఖ మేనేజర్ ఫర్జానా డోర్ వెనక నిలబడి తమతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అయితే తాను రేఖతో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. తనకు కరోనా లక్షణాలు లేవని చెప్పారని.. ఒకవేల కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటానని ప్రామిస్ చేశారని తెలిపారు.

ప్ర‌ముఖ న‌టి రేఖా బంగ్లాని సీల్ చేశారు ముంబై అధికారులు. బాంద్రాలో ఉన్న రేఖా బంగ్లా ‘సీ స్ప్రింగ్స్’ బంగ్లా ముందుండే ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగతి తెలిసిందే. దీంతో రేఖ‌ బంగ్లాను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించింది. అలాగే పరిస‌రాల‌ను శుభ్రం చేశామ‌ని బీఎంసీ వెల్ల‌డించింది.