సిడ్నీ నగరంలో గగుర్పాటు కలిగించే మ్యూజియం, శవాలతో ప్రదర్శనశాల

మ్యూజియంల గురించి తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి రోజు మరోటి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే కాబట్టి.!

సిడ్నీ నగరంలో గగుర్పాటు కలిగించే మ్యూజియం, శవాలతో ప్రదర్శనశాల
Real Bodies Museum
Follow us

| Edited By: Phani CH

Updated on: May 18, 2021 | 11:33 AM

మ్యూజియంల గురించి తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి రోజు మరోటి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే కాబట్టి.! మనకెంతసేపూ మ్యూజియంలు అంటే కత్తులు కటారులు, శిలలు శిల్పాలు, గడియారాలు పెయింటింగ్‌లు మాత్రమే గుర్తుకొస్తాయి.. కానీ ఇంకా చాలా చాలా ఉంటాయి.. ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉంటాయి. నవ్వించేవి ఉంటాయి. భయపెట్టేవి కూడా ఉంటాయి. ఏమిటీ…? భయపెట్టేవి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోకండి.. అలాంటివీ ఉన్నాయి. అసలు సిడ్నీ నగరంలో ఉన్న ఓ ప్రదర్శనశాలను చూస్తే ఇలాంటి మ్యూజియంలు కూడా ఉంటాయా..? అన్న అనుమానం రాకుండా ఉండదు.. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్‌ మ్యూజియం!

Real Bodies Museum (1)

కొన్ని మ్యూజియంలలో అడుగుపెడితే ఆహ్లాదం కలుగుతుంది.. అదే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సందర్శిస్తే మాత్రం కాసింత భయం వేస్తుంది. భయంతో పాటు గగుర్పాటు కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి మనుషుల శవాలు కాబట్టి! అదేమిటీ..? శవాలతో ఎగ్జిబిషనేమిటి..? అని ఎవరైనా అడిగితే …ఏం? .. సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో చూసినప్పుడు ఇక్కడ చూస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తారు నిర్వహాకులు.. అయితే మనలో నెలకొన్న ఎన్నో సందేహాలకు ఈ ప్రదర్శనశాల సమాధానాలు చెబుతుంది.. మన శరీరం లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది..? మన అవయవాలు ఎలా పనిచేస్తాయి…? కండరాల పనితీరు ఎలా ఉంటుంది.. ? మెదడు చేసే పనేమిటి..? కాలేయం కర్తవ్యమేమిటి..? వగైరా వగైరా అనుమాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. మన బాడీపై కచ్చితంగా మనకో అవగాహన కలుగుతుంది..

Real Bodies Museum (2)

ఇందులో 20 మృతదేహాలున్నాయి.. రెండువందలకు పైగా శరీర భాగాలున్నాయి.. ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.. ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్న శవాలు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కావట! అంటే చనిపోయిన తర్వాత మెడికల్‌ కాలేజీకో.. పరిశోధనల కోసమో ఇస్తారే అలాంటివి కావన్నమాట! ఛైనాలో ఫాలున్‌ గాంగ్‌ అనే ఓ నిషేధిత తెగ ఉంది.. వారి మృతదేహాలట! బహుశా వారంతా మరణశిక్ష పడిన ఖైదీల శవాలు అయి ఉండవచ్చంటారు అక్కడి డాక్టర్లు.. అయితే ప్రదర్శన నిర్వాహకుడు టామ్‌ జాలర్‌ వర్షన్ వేరే ఉంది.. సహజంగా మరణించిన వారి శవాలను మాత్రమే ప్రదర్శనలో పెట్టామంటున్నారాయన! శవాల గొడవ ఎలా ఉన్నా…ఈ ఎగ్జిబిషన్‌ను చూసేందుకు మాత్రం జనం భయం భయంగానే తండోపతండాలుగా వస్తున్నారు.

ఇట్టాంటి మ్యూజియమే ఆక్వాస్‌ కాలియంత్‌ నగరంలో ఉంది.. ఇదెక్కడుందంటే మెక్సికో-మోంతారే నగరాలకు మధ్యనున్న సాన్‌ డి గో టెంపుల్‌ సమీపంలో. మ్యూజియం పేరు నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ డెత్‌. ఇందులో నిజం మృతదేహాలు ఉండవు కానీ బొమ్మలుంటాయి. అస్థిపంజరాలుంటాయి. ఈ ప్రదర్శనశాలను చూస్తే మృత్యుభయం పోతుందట! రష్యాలో ఉన్న మ్యూజియం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది.. ఇందులో వైకల్యంతో చనిపోయిన శిశువుల పిండాలు. గర్భస్థంలోనే చనిపోయిన పిండాలు ఉన్నాయి. వాటన్నింటినీ సేకరించి వాటిని వెనిగర్‌లో నిల్వచేసి ప్రదర్శనకు పెట్టారు. ఈ మ్యూజియం చూసిన వాళ్లు జడుసుకోకుండా ఉండలేరు.

మరిన్ని ఇక్కడ చూడండి: బెంగాల్ ను వీడని నారదా కేసు, ఇద్దరు మంత్రులు సహా నలుగురు జైలుకు తరలింపు, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నేతలు

బెంగాల్ ను వీడని నారదా కేసు, ఇద్దరు మంత్రులు సహా నలుగురు జైలుకు తరలింపు, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నేతలు