AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..!

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్.. ఈ మోడరన్ క్రికెట్ దిగ్గజాలు కలిసి ఒకే టీమ్ తరపున ఆడారు. అది కూడా ఐపీఎల్‌లో. అవునండీ మీరు విన్నది నిజమే.

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..!
Ravi Kiran
|

Updated on: Aug 31, 2020 | 11:17 AM

Share

RCB Left Steve Smith Past: విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్.. ఈ మోడరన్ క్రికెట్ దిగ్గజాలు కలిసి ఒకే టీమ్ తరపున ఆడారు. అది కూడా ఐపీఎల్‌లో. అవునండీ మీరు విన్నది నిజమే. విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టీవ్ స్మిత్ ఓ ఎడిషన్‌లో ఐపీఎల్ ఆడాడు. కానీ అప్పుడు బ్యాట్‌తో విఫలం కావడంతో అతన్ని ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

2010లో రాయల్ ఛాలెంజర్స్.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన న్యూజిలాండ్ ఆటగాడు జెస్సీ రైడర్‌కు రీ-ప్లేస్‌మెంట్‌గా స్టీవ్ స్మిత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆ సీజన్‌లో స్మిత్ ఘోరంగా విఫలం కావడం జరగింది. అంతేకాకుండా టాప్ 3లో ఆర్సీబీ ఆ ఏడాది ఐపీఎల్‌ను ముగించింది. ఒకవేళ స్మిత్ ఇప్పటికీ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్‌లో ఉంటే మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీ, ఏబీ, స్మిత్‌ల కాంబినేషన్ బౌలర్లకు వణుకు పుట్టించేది అని చెప్పాలి.

అంతేకాకుండా ఆర్సీబీ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉండేది. కాగా, ఒక్క స్మితే కాదు.. భువనేశ్వర్ కుమార్, దినేష్ కార్తీక్, కరుణ నాయర్, ఇయాన్ మోర్గాన్ వంటి స్టార్ ప్లేయర్స్‌ను కూడా ఆర్సీబీ ఫామ్ లేకపోవడం వల్ల రిలీజ్ చేసింది. ఇక అలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రిలీజ్ అయిన ఆటగాళ్లు వేర్వేరు టీమ్స్‌లో అద్భుతంగా ఆడుతున్నారు.

Follow Us