AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆనంద్‌ మహింద్రా తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్‌లోకి మరో ముగ్గురు దిగ్గజాలు.. కీలక బాధ్యతలు!

RBI: ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ సీనియర్ అధికారిణి అన్నీ జార్జ్ మాథ్యూలు ఈ నూతన సభ్యులుగా ఎంపికయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ (ACC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934 లోని సెక్షన్ 8(1)(సి) ప్రకారం ఈ నియమకాలను..

RBI: ఆనంద్‌ మహింద్రా తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్‌లోకి మరో ముగ్గురు దిగ్గజాలు.. కీలక బాధ్యతలు!
RBI
Subhash Goud
|

Updated on: Aug 28, 2026 | 7:55 AM

Share

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సెంట్రల్ బోర్డ్‌ను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డులో కొత్తగా ముగ్గురు పారితోషికేతర (non-official) సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి (UN)లో భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, ప్రముఖ అర్థశాస్త్రవేత్త జన్మేజయ కుమార్ సిన్హా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ సీనియర్ అధికారిణి అన్నీ జార్జ్ మాథ్యూలు ఈ నూతన సభ్యులుగా ఎంపికయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ (ACC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934 లోని సెక్షన్ 8(1)(సి) ప్రకారం ఈ నియమకాలను ఆమోదించింది. శనివారం సిబ్బంది, శిక్షణా శాఖ (DoPT) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

నాలుగేళ్ల కాలపరిమితి:

కొత్తగా ఎంపికైన ఈ ముగ్గురు సభ్యులు నాలుగేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఇటీవలె ఆనంద్ మహీంద్రా, ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌లను కూడా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నియామకాలతో ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుల సంఖ్య 11 నుంచి 14కు పెరిగింది.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

ఇవి కూడా చదవండి
  1. సయ్యద్ అక్బరుద్దీన్ (66): ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీతో అనుబంధం కలిగి ఉన్నారు.
  2. జన్మేజయ కుమార్ సిన్హా (66): ప్రముఖ ఆర్థికవేత్త, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) ఆసియా-పసిఫిక్ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈయన, ఆర్థిక రంగ సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీల్లో పనిచేశారు.
  3. అన్నీ జార్జ్ మాథ్యూ (62): కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఈమె, ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్నారు. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (IA&AS) అధికారిగా ఆర్థిక నిర్వహణ, పబ్లిక్ ఫైనాన్స్‌లో 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ద్రవ్య పరపతి విధానాల రూపకల్పన మరియు ఆర్థిక రంగ పర్యవేక్షణలో వివిధ రంగాలకు చెందిన ఈ దిగ్గజాల అనుభవం ఆర్బీఐ బోర్డుకు ఎంతో దోహదపడనుంది.

ఇది కూడా చదవండి: Eye Glasses: కళ్లద్దాలు వాడితే కంటి పవర్ పెరుగుతుందా? చాలా మందికి ఉన్న పెద్ద అపోహా ఏంటి?

ఇది కూడా చదవండి: BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us