AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సలు లైట్ తీసుకోవద్దు.. సొరకాయ వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..

తెలుగు రాష్ట్రాల్లో సొరకాయది ఎంతో ప్రాధాన్యత ఉంది. బరువు తగ్గడానికి, శరీరాన్ని చల్లబరచడానికి వీటిని అమృతంలా భావించి తింటుంటారు. అయితే, అందరికీ మేలు చేస్తుందనుకునే ఈ కూరగాయ కొన్ని సందర్భాల్లో విషంగా మారే ప్రమాదం ఉందని మీకు తెలుసా? కొందరు పొరపాటున కూడా వీటిని ముట్టుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Aug 28, 2026 | 7:34 AM

Share
సొరకాయలో అత్యంత ప్రమాదకరమైన విషయం కుకుర్బిటాసిన్ అనే రసాయనం. కూరగాయ చేదుగా మారినప్పుడు ఈ విషపూరిత సమ్మేళనం ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. చేదుగా ఉన్న సొరకాయను వండి తిన్నా లేదా పచ్చి రసం తాగినా అది శరీరంలో విషంగా మారుతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయంలో అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

1 / 5
జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తరచుగా గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం లేదా ఐబీఎస్ సమస్యలు ఉన్నవారు వీటిని తింటే ఆ ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయి. ముఖ్యంగా ఉదయం పూట పరగడుపున పచ్చి సొరకాయ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కడుపులో అల్సర్లు, పేగుల్లో పుండ్లు ఉన్నవారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

2 / 5
షుగర్ పేషెంట్లలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇవి ఉపయోగపడినప్పటికీ.. లో-షుగర్ సమస్య ఉన్నవారు తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే షుగర్ మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నీరసం, తల తిరగడం, స్పృహ తప్పడం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.

3 / 5
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. శరీరానికి విపరీతమైన చలవ చేసే గుణం ఉండటం వల్ల ఆస్తమా, తరచుగా జలుబు, సైనస్, తీవ్రమైన దగ్గుతో బాధపడేవారు వర్షాకాలం, చలికాలంలో వీటిని ఎక్కువగా తినకూడదు. దీనివల్ల శ్వాసనాళాల్లో కఫం పేరుకుపోయి ఊపిరాడకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే స్కిన్ అలర్జీలు ఉన్నవారు కూడా వీటిని మితంగానే తీసుకోవాలి.

4 / 5
సొరకాయ కోసేటప్పుడు ముందుగా ఒక చిన్న ముక్కను కొరికి రుచి చూడటం తప్పనిసరి. ఏమాత్రం చేదుగా అనిపించినా ఆ కాయను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పారేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు వీటిని రోజూ డైట్‌లో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

5 / 5
Follow Us
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్

మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా

శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం

నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..

జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..

ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్

వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..

బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్

కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..