AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: ఇరుముడి ఈవెంట్‏లో రవితేజ తాగిన వాటర్ ఇదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..

రవితేజ ఇటీవల ఇరుముడి ఈవెంట్ లో తాగిన వాటర్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. అద్భుతమైన శక్తి, ఫిట్‌నెస్‌కు కారణమైన ప్రత్యేక వాటర్ గురించి నటుడు లోకేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దోసకాయ, నిమ్మకాయ, అల్లం, తులసి ఆకులతో కూడిన ఈ హైడ్రేటింగ్ డ్రింక్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని అన్నారు.

Ravi Teja: ఇరుముడి ఈవెంట్‏లో రవితేజ తాగిన వాటర్ ఇదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..
Ravi Teja
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2026 | 7:10 AM

Share

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ నటించిన ఇరుముడి సినిమా మేనియా నడుస్తుంది. అయితే అటు సోషల్ మీడియాలో మాత్రం ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో రవితేజ తాగిన వాటర్ బాటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఆ బాటిల్‌లో ఉన్నది ఏమిటి అనే చర్చ సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య తీవ్రంగా జరిగింది. తాజాగా ఈ వాటర్ గురించి ఇరుముడి నటుడు లోకేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడు రవితేజ అద్భుతమైన ఎనర్జీ, ఫిట్‌నెస్‌ వెనుక దాగి ఉన్న రహస్యం ఇప్పుడు బయటపడింది. ఈ ప్రత్యేక వాటర్ సాధారణ నీరు కాదు. ఇది దోసకాయ (కుకుంబర్), నిమ్మకాయ (లెమన్), అల్లం (జింజర్) , తులసి ఆకులతో (బేసిల్ లీవ్స్) కూడిన ఒక హైడ్రేటింగ్ డ్రింక్. ఈ పదార్థాలను నీటిలో నానబెట్టి, ఆ పానీయాన్ని రవితేజ గారు క్రమం తప్పకుండా తీసుకొంటున్నారని తెలిపారు. ఈ మిశ్రమం శరీరానికి అద్భుతమైన హైడ్రేషన్‌ను అందించి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుందట.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

మాస్ మహారాజ్ రవితేజ గారి అంతులేని ఉత్సాహానికి, ఫిట్‌నెస్‌కు ఈ పానీయం ఒక ముఖ్య కారణం. ఈ ఆరోగ్యకరమైన పానీయం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ డ్రింక్ గురించి ఆత్రం అనే వ్యక్తి గతంలోనే వివరించడం గమనార్హం. సాధారణ ప్రజలు కూడా ఈ పానీయాన్ని తయారుచేసుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రవితేజ గారి ఆరోగ్య రహస్యం బయటపడటంతో, ఆయన అభిమానులు ఈ ప్రత్యేక పానీయాన్ని ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

రోజువారీ జీవితంలో సాధారణ నీటికి బదులుగా ఇలాంటి డిటాక్స్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రవితేజ లాంటి ఫిట్‌నెస్ సీక్రెట్‌ను పాటించాలనుకునేవారు ఈ సహజమైన డ్రింక్‌ను తమ డైట్‌లో భాగం చేసుకోవచ్చు!

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us