AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆటో డ్రైవర్ నిజాయితీ.. వేల రూపాయలు ఉన్న బ్యాగ్ తిరిగి అప్పగింత!

షాద్‌నగర్ ఆటో డ్రైవర్ అత్యంత నిజాయితీని ప్రదర్శించి, ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్‌ను, అందులోని ₹34,000 నగదును తిరిగి అప్పగించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు, ఆటో యూనియన్ సభ్యులు డ్రైవర్‌ను అభినందించారు. డబ్బుకు ఆశపడకుండా నిజాయితీగా వ్యవహరించిన ఈ చర్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది.

Hyderabad: ఆటో డ్రైవర్ నిజాయితీ.. వేల రూపాయలు ఉన్న బ్యాగ్ తిరిగి అప్పగింత!
Auto Driver Honesty
Balaraju Goud
|

Updated on: Aug 28, 2026 | 7:25 AM

Share

నిజాయితీకి డబ్బుతో సంబంధం లేదని నిరూపించారు ఓ ఆటో డ్రైవర్. ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్‌ను గుర్తించి, అందులో ఉన్న నగదును సురక్షితంగా తిరిగి అప్పగించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. నిజాయితీ చూపిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు, ఆటో యూనియన్ సభ్యులు అభినందించారు.

షాద్‌నగర్ పట్టణంలో ఓ వ్యక్తి ఆటోలో ప్రయాణించాడు. ప్రయాణం పూర్తయిన అనంతరం ఆటో దిగే సమయంలో తన బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయాడు. కొంతసేపటి తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన అతడు పోలీసులను ఆశ్రయించి ఘటనపై సమాచారం అందించాడు. బ్యాగ్‌లో విలువైన వస్తువులతో పాటు రూ.34,000 నగదు ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.

ఇదిలా ఉండగా.. ఆటో డ్రైవర్‌కు ప్రయాణికుడు బ్యాగ్‌ను మర్చిపోయిన విషయం గుర్తైంది. బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో నగదు ఉండటంతో దానిని తన వద్ద ఉంచుకోకుండా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ప్రయాణికుడి ఆచూకీ తెలుసుకుని అతడిని స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం ఆటో డ్రైవర్ సమక్షంలో బ్యాగ్‌ను, అందులో ఉన్న రూ.34,000 నగదును ప్రయాణికుడికి సురక్షితంగా తిరిగి అందజేశారు. దీంతో బ్యాగ్ పోయిందని ఆందోళన చెందిన బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు.

డబ్బుకు ఆశపడకుండా నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు, ఆటో యూనియన్ సభ్యులు అభినందించారు. ఇలాంటి నిజాయితీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us