Ration Rice by OTP : కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టేంత వరకు ఓటీపీ, ఐరిస్ సేవల ద్వారా చౌక ధరల దుకాణాల లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ దుకాణాల్లో ఒకే బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించటం ద్వారా కోవిడ్ వైరస్ ప్రబలే అవకాశం ఉందన్న హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు లబ్ధిదారులకు ఓటీపీ, ఐరిస్ ద్వారా బియ్యం పంపిణీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లకు గురువారం జారీ పంపించింది. క్షేత్రస్థాయి అధికారులకు ఈ విషయమై మార్గదర్శకాలు జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ కలెక్టర్లకు సూచించారు.