AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీకి మరో రంగస్థలం.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సినిమాల్లో ఒక డ్రీమ్ రోల్ ప్లే చేయాలని ఉందట. ఒక స్పోర్ట్స్ స్టార్ పాత్రలో కనిపించాలన్నది అతని మక్కువట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేశారు చెర్రీ. ఈ తరహా మూవీ..

చెర్రీకి మరో రంగస్థలం.!
Pardhasaradhi Peri
|

Updated on: Aug 26, 2020 | 5:09 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సినిమాల్లో ఒక డ్రీమ్ రోల్ ప్లే చేయాలని ఉందట. ఒక స్పోర్ట్స్ స్టార్ పాత్రలో కనిపించాలన్నది అతని మక్కువట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేశారు చెర్రీ. ఈ తరహా మూవీ ఆల్రెడీ ఆర్బీ చౌదరి గారి బ్యానర్లో ‘మెరుపు’ టైటిల్ తో స్టార్ట్ చేశాం కూడా అని చరణ్ చెప్పాడు. అయితే, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదని.. ఆ ప్రాజెక్ట్ అలాగే ఆగిపోయిందని తెలిపాడు. అప్పటి నుంచీ తను క్రీడా నేపథ్యంలో సాగే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నాని మనసులో మాట బయటపెట్టాడు రామ్ చరణ్. అయితే, ఈ జానర్ లో తనకు మంచి స్క్రిప్ట్ ఇంతవరకూ దొరకలేదని .. దొరికితే మాత్రం స్పోర్ట్స్ మ్యాన్ గా ముందుకు వస్తానని చెప్పేశాడు. ఇప్పటి వరకూ క్రీడాంశాల నేపథ్యంలో వచ్చిన చాలా శాతం సినిమాలు సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చెర్రీకి కూడా అన్నీ కుదరితే మరో ‘రంగస్థలం’ దొరుకుతుందన్నమాట.

Follow Us