పవన్ ఫ్యాన్స్ కు చరణ్, మైత్రీ మూవీ మేకర్స్ సాయం

తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ ప్రాణాలొదిలిన ఫ్యాన్స్ కు మెగా ఫ్యామిలీ హీరోలే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బాసటగా నిలుస్తోంది. అందరూ బాధిత కుంటుంబాలకు తీవ్ర సంతాపాన్ని..

పవన్ ఫ్యాన్స్ కు చరణ్, మైత్రీ మూవీ మేకర్స్ సాయం
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 02, 2020 | 3:48 PM

తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ ప్రాణాలొదిలిన ఫ్యాన్స్ కు మెగా ఫ్యామిలీ హీరోలే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బాసటగా నిలుస్తోంది. అందరూ బాధిత కుంటుంబాలకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చుతూ తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఘటన జరిగిన సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి, రామ్ చరణ్, సహా మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ అభిమానులు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు అల్లు అర్జున్ ఫ్లెక్సీ దుర్ఘటనలో చనిపోయిన బాధితులకు రెండు లక్షల రూపాయల చొప్పున సాయాన్ని ప్రకటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కొక్కరికీ రెండున్నర లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అటు చిత్ర నిర్మాణ సంస్థ మూత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.