రాకేష్ సింగ్ కోర్కెను తిరస్కరించినందుకే నన్ను కేసులో ఇరికించాడు, పమేలా గోస్వామి
తమ బీజేపీ నేత రాకేష్ సింగ్ పై బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి సంచలన ఆరోపణలు చేసింది. 100 గ్రాముల కొకైన్ తీసుకువెళ్తూ కోల్ కతా పోలీసులకు..

తమ బీజేపీ నేత రాకేష్ సింగ్ పై బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి సంచలన ఆరోపణలు చేసింది. 100 గ్రాముల కొకైన్ తీసుకువెళ్తూ కోల్ కతా పోలీసులకు ఈమె పట్టుబడింది. ఈ కేసులో రాకేష్ సింగ్ సహ నిందితుడిగా ఉన్నాడు. గురువారం కోర్టుకు హాజరైన పమేలా.. రాకేష్ కుట్రకు తను బలయ్యానని పేర్కొంది. ఈమె 5 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ‘భారత్ మాతాకీ జై’ అంటూ కోర్టులో ప్రవేశించిన పమేలా.. సత్యమే జయిస్తుందని, రాకేష్ సింగ్ లా కాకుండా తాను చట్టం నుంచి పారిపోలేదని వ్యాఖ్యానించింది. రాకేష్ తప్పులేకపోతే ఎందుకు పారిపోతాడని ప్రశ్నించింది. గార్సి అనే ప్రాంతంలో పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని కూడా ఆమె సందేహం వ్యక్తం చేసింది. తనపట్ల రాకేష్ ఆసక్తి పెంచుకున్నాడని, అతని కోర్కెను కాదనడంతో ఆగ్రహించి ఈ కేసులో ఇరికించాడని పమేలా తెలిపింది. అతడిని నేను పట్టించుకోవడం మానేసరికి మరింత రెచ్చిపోయాడు.. భౌతికంగా నన్ను వేధించాడు.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు అని ఆమె వెల్లడించింది.
అతనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఇలా అనేకరకాలుగా బెదిరించాడని, మా వాళ్ళను చంపేస్తానని కూడా హెచ్చరించాడని పమేలా పేర్కొంది. రాకేష్ సింగ్ సహచరుడొకరు నా పర్సులో ఈ కొకైన్ ఉంచాడని, నిజానికి ఇలాంటి కుట్ర ఏదో జరుగుతుందని తాను అనుమానించానని ఆమె చెప్పింది. తనను అక్రమ ఆయుధాల కేసులో ఇరికిస్తారేమోనని భావించానని పమేలా గోస్వామి పేర్కొంది. బీజేపీలో మరెవరిపైనా తనకు ఫిర్యాదులు లేవని ఆమె వెల్లడించింది. కాగా రాకేష్ సింగ్ ని మార్చి 1 వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేశారు. అటు-తనపై లోగడ పమేలా చేసిన ఆరోపణలను రాకేష్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నాడు.
Also Read:
Test Cricket Players: టెస్టుల్లో ఫాస్టెస్ట్ 10 వేల పరుగులు.. ఆ నలుగురి కంటే విరాట్ కోహ్లీకే సాధ్యం..
సూర్యకుమార్ యాదవ్ తుఫాను ఇన్నింగ్స్.. టీమిండియా తుది జట్టులో చోటు దొరికినట్లే.!