AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లుకు రాజ్య‌స‌భ‌ ఆమోదం

రాజ్య‌స‌భ‌లో ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు దేశీయ విమాన సర్వీసులకు తీర్చిదిద్దామని కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు.

ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లుకు రాజ్య‌స‌భ‌ ఆమోదం
Balaraju Goud
|

Updated on: Sep 15, 2020 | 1:08 PM

Share

రాజ్య‌స‌భ‌లో ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు దేశీయ విమాన సర్వీసులకు తీర్చిదిద్దామని కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్య‌స‌భ‌లో ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లు గురించి మాట్లాడుతూ.. గ‌త మూడేళ్ల‌లో వెయ్యి మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ల‌ను రిక్రూట్ చేశామ‌న్నారు. అయితే ఖాళీలు మాత్రం 3,500 ఉన్న‌ట్లు స్పష్టం చేశారు. స్పష్టం చేశారు. కొవిడ్ ప్రభావంతో ప్ర‌స్తుతం రిక్రూట్మెంట్ ప్ర‌క్రియ మంద‌గించింద‌న్నారు.

దేశంలో విమానయాన రంగం ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల వ‌చ్చిన 29వేల కోట్ల‌ను విమానాశ్ర‌యాల అభివృద్ధికి వాడ‌నున్న‌ట్లు మంత్రి స్పష్టం చేశారు. విమానయాన రంగ ర‌క్ష‌ణ విషయంలో ఎటువంటి లాలూచీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ముంబై, ఢిల్లీ విమానాశ్ర‌యాలు 2006లో ప్రైవేటుప‌రం చేశార‌ని, ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లు 33 శాతం రాకపోకలు పెరిగాయని, అంతేస్థాయిలో ఆదాయం కూడా పెరిగిందన్నారు. అయితే 2018లో ప్రైవేటీక‌ర‌ణ చేసిన ఆరు విమానాశ్ర‌యాల‌తో కేవ‌లం 9 శాతం ఆదాయం వ‌స్తుంద‌న్నారు. ఆ విమానాశ్ర‌యాల కోసం ఓపెన్ బిడ్డింగ్‌కు వెళ్లిన‌ట్లు చెప్పారు. తిరువ‌నంత‌పురం ఎయిర్‌పోర్ట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు కేర‌ళ ప్ర‌భుత్వానికి అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్నారు.

సామాన్యుడికి కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘటన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనన్న మంత్రి హరిదీప్.. వందేభార‌త్ మిష‌న్ ద్వారా 16 ల‌క్ష‌ల మంది భార‌తీయుల‌ను స్వదేశానికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం తొలి రోజు 36 ల‌‌క్ష‌ల మంది ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌ను విజిట్ చేసిన‌ట్లు చెప్పారు. విమాన టికెట్ ధ‌ర‌లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటీక‌రించాల‌ని లేదంటే మూసివేయాల్సి వ‌స్తుంద‌న్నారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్ త‌ర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లును రాజ్య‌స‌భ ఆమోదించింది.

Follow Us
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా 2వసారి గోల్డ్ మెడల్
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా 2వసారి గోల్డ్ మెడల్
పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి! కూరగాయల ధరలు తెలిస్తే.
పండక్కి ముందే ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి! కూరగాయల ధరలు తెలిస్తే.
అమ్మాయిల పాదల ఆకారమే వారి వ్యక్తిత్వం తెలుపుతుందని తెలుసా?
అమ్మాయిల పాదల ఆకారమే వారి వ్యక్తిత్వం తెలుపుతుందని తెలుసా?
అక్టోబర్ లక్కీ రాశులు.. వీరికి నెల మొత్తం అదృష్టమే అదృష్టం
అక్టోబర్ లక్కీ రాశులు.. వీరికి నెల మొత్తం అదృష్టమే అదృష్టం
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ ఇప్పించండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ ఇప్పించండి..
తెలంగాణలో మందుబాబులు ఇంతమందా..?
తెలంగాణలో మందుబాబులు ఇంతమందా..?
'రాత్రికి రాత్రే సక్సెస్ రాదు.. వెంటనే ఫలితం రాలేదని ఆగిపోకండి'
'రాత్రికి రాత్రే సక్సెస్ రాదు.. వెంటనే ఫలితం రాలేదని ఆగిపోకండి'
గయలో పిండదానం చేస్తే ఎన్ని తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది?..
గయలో పిండదానం చేస్తే ఎన్ని తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది?..
పెళ్లి బట్టలతోనే సంతాప సభకు వెళ్లిన స్టార్ హీరోయిన్.!
పెళ్లి బట్టలతోనే సంతాప సభకు వెళ్లిన స్టార్ హీరోయిన్.!
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ