Orey Bujji Ga Telugu Movie Review
సినిమా: ఒరేయ్ బుజ్జిగా
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్, వాణీ విశ్వనాద్, నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు
డైరెక్టర్: విజయ్ కుమార్ కొండ
నిర్మాత: కె.కె. రాధామోహన్
బ్యానర్: సత్యసాయి ఆర్ట్స్
విడుదల: ఆహా(ఓటీటీ)
యువ కథానాయకుడు రాజ్ తరుణ్, దర్శకుడు విజయ్ కుమార్ కొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’. సరిగ్గా థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కరోనా వచ్చి ఆ ఆశలపై నీళ్లు చల్లింది. దీనితో ఈ సినిమా ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రాజ్ తరుణ్, దర్శకుడు విజయ్ కుమార్ కొండకు ఈ సినిమా హిట్ టాక్‌ను తెచ్చిపెట్టిందా.? లేదా.? అనేది ఈ రివ్యూలో చూసేద్దాం!!
అసలు కథేంటంటే: బుజ్జి(రాజ్ తరుణ్)కు బలవంతంగా పెళ్లి చేసేందుకు అతడి తండ్రి కోటేశ్వరరావు(పోసాని కృష్ణ మురళి) సిద్దపడతాడు. మరో వైపు అదే ఊళ్లో ఉండే చాముండేశ్వరి(వాణీ విశ్వనాధ్) కూడా తన కూతురు(మాళవిక నాయర్)కు ఇష్టంలేని పెళ్లి చేయాలనుకుంటుంది. దీనితో బుజ్జి, కృష్ణవేణిలు ఇంట్లో నుంచి పారిపోయే యాధృచ్చికంగా ఒకే ట్రైన్ ఎక్కుతారు. వీరిద్దరూ ట్రైన్ ఎక్కడం చూసిన వ్యక్తి ఒకరు.. ఇద్దరు కలిసి పారిపోయారని ఊరిలో ప్రచారం చేస్తాడు. దీనితో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది. అదే సమయంలో శ్రీను, స్వాతి పేర్లతో బుజ్జి, కృష్ణవేణిలు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. వీరి పరిచయం ప్రేమగా మారిందా.? బుజ్జి, కృష్ణవేణిల కుటుంబాలు చివరికి కలిశాయా.? బుజ్జి, కృష్ణవేణిల లైఫ్‌లోకి వచ్చిన సృజన కథేంటి.? తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.
Also Read: శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..
ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలి. బుజ్జి/శ్రీను పాత్రల్లో రాజ్ తరుణ్ చక్కటి ఈజ్‌తో నటించాడు. డైలాగ్ డెలివరీలో చురుకుదనంతో పాటు కామెడీని అలవోకగా పండించాడు. అలాగే మాళవిక నాయర్ ఎప్పటిలానే తన నటనతో మెప్పించింది. హెబ్బా పటేల్ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతసేపూ నవ్వులు పంచింది. నరేష్, పోసాని, వాణీ విశ్వనాధ్‌లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సప్తగిరి, సత్యల కామెడీ పండి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్‌ను అందించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంతుంది, అలాగే ద్వితీయార్ధంలో సినిమా కాస్త ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్ పడి ఉంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేది.
మైనస్ పాయింట్స్: ఈ సినిమా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే.. మొదటిగా కథే అని చెప్పాలి. దర్శకుడు విజయ్ కుమార్ కొండ రాసుకున్న కథ కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి కన్ఫ్యూషన్ డ్రామా సినిమాలు ఎన్నో వచ్చాయి. ఆ తరహాకు చెందినదే ఈ ‘ఒరేయ్ బుజ్జిగా’. ఈ మూవీని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా, యూత్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దంలో దర్శకుడు గట్టి ప్రయత్నమే చేశాడు. ఆ క్రమంలోనే ఫస్ట్, సెకండాఫ్‌లలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ పడి ఉంటే బొమ్మ వేరే లెవెల్‌లో ఉండేది. అటు కొన్ని సీన్స్‌లో విజయ్ కుమార్ కొండ మార్క్ కనిపిస్తుంది.
తీర్పు: సరదాగా నవ్వించే ‘ఒరేయ్ బుజ్జిగా’