AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: రాహుల్‌కి షాక్.. పునర్నవి ఎలిమినేషన్ పక్కా.?

బిగ్ బాస్ సీజన్ 3‌ ప్రేక్షకులను తనదైన దూకుడుతో ఆకట్టుకున్న కంటెస్టెంట్ పునర్నవి. మొదట హాట్ హాట్ డ్రెస్సులతో కాక పుట్టించినా.. ఆ తర్వాత క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షించింది. కానీ ప్రస్తుతం ఆమెపై వ్యతిరేకత ఎక్కువైందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. షో ఆరంభంలో ఎక్కువగా నామినేషన్స్ నుంచి బయటపడినా.. ముందొక మాట వెనకొక మాట అన్న తీరుతో తనకు తానే ఎలిమినేషన్స్ ఎదుర్కుంటోంది. ఆమె ప్రవర్తన వల్లే ఇదంతా జరుగుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. […]

బిగ్ బాస్: రాహుల్‌కి షాక్.. పునర్నవి ఎలిమినేషన్ పక్కా.?
Ravi Kiran
|

Updated on: Oct 05, 2019 | 12:18 PM

Share

బిగ్ బాస్ సీజన్ 3‌ ప్రేక్షకులను తనదైన దూకుడుతో ఆకట్టుకున్న కంటెస్టెంట్ పునర్నవి. మొదట హాట్ హాట్ డ్రెస్సులతో కాక పుట్టించినా.. ఆ తర్వాత క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షించింది. కానీ ప్రస్తుతం ఆమెపై వ్యతిరేకత ఎక్కువైందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

షో ఆరంభంలో ఎక్కువగా నామినేషన్స్ నుంచి బయటపడినా.. ముందొక మాట వెనకొక మాట అన్న తీరుతో తనకు తానే ఎలిమినేషన్స్ ఎదుర్కుంటోంది. ఆమె ప్రవర్తన వల్లే ఇదంతా జరుగుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల రవికృష్ణను తిట్టడం.. అంతేకాక రాహుల్‌ను కూడా అదే పనిగా దుయ్యబట్టడం ఆమెపై వ్యతిరేకతను పెంచుతూ వచ్చింది.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బిగ్ బాస్ 3పై కూడా మండిపడుతున్నారు. రాహుల్‌తో సాగుతున్న లవ్ ‌ట్రాక్ కోసమే పునర్నవిని ఇన్నాళ్లు సేవ్ చేస్తూ వచ్చారని.. వాస్తవానికి రమ్యకృష్ణ హోస్టుగా వ్యవహరించిన ఎపిసోడ్‌తోనే పున్ను ఎలిమినేట్ కావాల్సి ఉందని.. కానీ ఆ వారం కావాలనే ఎలిమినేషన్‌ను రద్దు చేశారని తిట్టిపోస్తున్నారు.

పునర్నవి మనిషి ఎదురుగా లేనప్పుడు ఒక మాట.. వారి వెనక ఒక మాట చెబుతుందన్న నెటిజన్ల వ్యాఖ్యలు ఏరోజుకా రోజు పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాక వరుణ్, వితిక, రాహుల్‌ గ్రూప్‌‌తో ఉండటం వల్ల ఎక్కువ సేవ్ అవుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆమె చేసే కామెంట్స్, ప్రవర్తనకు నెట్టింట్లో తెగ విమర్శలు ఎదురవుతున్నాయి. అంతేకాక ఈవారం ఎలిమినేషన్స్‌లో ఆమెకే తక్కువ ఓటింగ్ శాతం నమోదైందని ఇన్‌సైడ్ టాక్. పునర్నవి అనధికారికంగా బయటికి వచ్చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అటు మహేష్ విట్టా కూడా ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్