AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ45

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలోని స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ సీ-45 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9.27గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహనం ద్వారా డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌ను అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన మరో 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో […]

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ45
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 01, 2019 | 10:46 AM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలోని స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ సీ-45 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9.27గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహనం ద్వారా డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌ను అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన మరో 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు.

ప్రాథమికంగా ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు తెలుస్తున్నా, ఉపగ్రహాలన్నీ నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశించడానికి మరికొంత సమయం పట్టనుంది. అయితే ఒకే ప్రయోగంలో మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. కాగా 436 కేజీల బరువు గల ఇమిశాట్ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహం వలన శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే