AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎస్ఎల్ 11లో కాసుల వర్షం.. భారీ లాభాలతో రికార్డులు బ్రేక్.. కట్‌చేస్తే.. ఐపీఎల్‌తో పోల్చితే ఎంత తేడానో తెలుసా?

IPL vs PSL Money Gap: ఆర్థిక లాభాల పరంగా ఐపీఎల్ అందిపుచ్చుకోలేనంత ఎత్తులో ఉన్న మాట వాస్తవమే అయినా, పాకిస్తాన్ లాంటి దేశంలో క్రికెట్ మనుగడ సాగించడానికి, సరికొత్త ప్రతిభావంతులైన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేయడానికి పీఎస్ఎల్ సాధించిన ఈ రికార్డు విజయం ఎంతగానో దోహదపడుతుంది.

పీఎస్ఎల్ 11లో కాసుల వర్షం.. భారీ లాభాలతో రికార్డులు బ్రేక్.. కట్‌చేస్తే.. ఐపీఎల్‌తో పోల్చితే ఎంత తేడానో తెలుసా?
Psl Vs Ipl Prize Money Gap
Venkata Chari
|

Updated on: Jun 11, 2026 | 12:41 PM

Share

IPL vs PSL Money Gap: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పాకిస్తాన్ సూపర్‌ లీగ్ (పీఎస్ఎల్ 2026) మునుపెన్నడూ లేని విధంగా కాసుల వర్షం కురిపించింది. పీఎస్ఎల్ చరిత్రలోనే అత్యధిక లాభాలను అర్జించి సరికొత్త రికార్డు సృష్టించినప్పటికీ, భారత రిచ్ లీగ్ ఐపీఎల్ సంపాదనతో పోల్చి చూస్తే పాక్ లీగ్ కేవలం పిసరంత మాత్రమేనని క్రీడా విశ్లేషకులు తేల్చి చెపుతున్నారు.

చరిత్రలోనే అత్యధిక లాభాలు.. సరికొత్త రికార్డు..!

పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన పీఎస్ఎల్ 11వ సీజన్ అద్భుత ఆర్థిక విజయంతో ముగిసింది. ఈ ఏడాది నుంచి జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచడం బోర్డుకు కాసుల పంట పండించింది. హైదరాబాద్ కింగ్స్‌మెన్, రావల్పిండిజ్ జట్ల కొత్త చేరికతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 34 నుంచి 44కు పెరిగింది. మెజారిటీ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే జరిగినప్పటికీ, ఆదాయంలో మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజా నివేదికల ప్రకారం, ఈ సీజన్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) అక్షరాలా 7.549 బిలియన్ల పాక్ రూపాయల (సుమారు రూ. 260 కోట్ల భారతీయ కరెన్సీ) నికర లాభం చేకూరింది.

మూడు రెట్లకుపైగా పెరిగిన సంపాదన..

పాక్ సెనేట్ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన వివరాల ప్రకారం, ఈ విడత పీఎస్ఎల్ మొత్తం ఆదాయం 10.195 బిలియన్ రూపాయలు దాటగా, ఖర్చులు కేవలం 2.645 బిలియన్ రూపాయలుగా నమోదయ్యాయి. గడచిన 2025 సీజన్‌లో పీసీబీకి కేవలం 2 బిలియన్ల లాభం రాగా, 2024లో 2.46 బిలియన్ల లాభం వచ్చింది. అంటే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 3.75 రెట్లు అదనపు లాభాలను ఆర్జించి పాక్ బోర్డు చరిత్ర సృష్టించింది. ఈ మొత్తం లాభాల్లో పీసీబీ వాటా 18 శాతం (సుమారు రూ. 45 కోట్ల భారతీయ కరెన్సీ) కాగా, మిగిలిన 6.25 బిలియన్ రూపాయలను పది ఫ్రాంచైజీలకు సమానంగా పంచనున్నారు. దీని ప్రకారం ఒక్కో జట్టుకు దాదాపు రూ. 21 కోట్ల భారతీయ కరెన్సీ లభించనుంది.

ఐపీఎల్ సామ్రాజ్యం ముందు పీఎస్ఎల్ ఎంత?

పీఎస్ఎల్ రికార్డు లాభాలను సాధించిన మాట నిజమే అయినప్పటికీ, భారత ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాండ్ వాల్యూ, సంపాదన ముందు ఇది ఇసుక రేణువంత మాత్రమే. భారతీయ ఫ్రాంచైజీల సగటు ఆదాయాన్ని పరిశీలిస్తే, ఒక్కో ఐపీఎల్ జట్టు కేవలం ఒక ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయల మేర భారీ రెవెన్యూను సొంతం చేసుకుంటున్నాయి. అంటే పీఎస్ఎల్ లీగ్ మొత్తం సంపాదన, ఐపీఎల్‌లోని సగం జట్ల వార్షిక ఆదాయానికి కూడా సరిపోలడం లేదు. దీన్ని బట్టే ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ ఎంతటి తిరుగులేని ఆర్థిక శక్తో అర్థం చేసుకోవచ్చు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుత విజయం..

భారత ఐపీఎల్ 2026 షెడ్యూల్‌తో పోటీ పడుతూ, ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినప్పటికీ ఈ స్థాయి లాభాలు రావడం పాకిస్తాన్ క్రికెట్‌కు పెద్ద ఊరట అనే చెప్పాలి. ఈ ఉత్కంఠభరిత సీజన్‌లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. కెప్టెన్ బాబర్ అజామ్ 588 పరుగులతో ముందుండి నడిపించగా, కుశాల్ మెండిస్ 550 పరుగులతో రాణించి జట్టుకు రెండో పీఎస్ఎల్ ట్రోఫీని అందించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ క్రీడారంగానికి ఈ లాభాలు ఖచ్చితంగా ఒక శుభపరిణామం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us