ఆరోగ్యవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Arogya Van in Kevadia : ఆరోగ్య వన్ పార్కును ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ ఉదయం నర్మదా జిల్లాలోని కెవాడియాలో ఆరోగ్య వన్ పార్కును ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన టూరిస్టు వాహనంలో పార్కు అంతటా కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ కూడా […]

Arogya Van in Kevadia : ఆరోగ్య వన్ పార్కును ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ ఉదయం నర్మదా జిల్లాలోని కెవాడియాలో ఆరోగ్య వన్ పార్కును ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన టూరిస్టు వాహనంలో పార్కు అంతటా కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ కూడా ఉన్నారు.
#WATCH| Gujarat: Prime Minister Narendra Modi takes a tour of ‘Arogya Van’ in Kevadia after inaugurating it. pic.twitter.com/9QXx0IL3Jh
— ANI (@ANI) October 30, 2020
ఈ పార్కుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ వందలాది ఔషధ మొక్కలను, అరోమా పొదలను పెంచారు. అంతేగాక వాటి ఉపయోగాలు, ప్రాముఖ్యతలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి మొక్క విషేశాలను చెప్పేందుకు పార్కు గైడ్ కూడా ఏర్పాటు చేశారు. ఓషధీ మొక్కలు, పొదలు.. వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ పార్కును సిద్ధం చేశారని ప్రధాని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో వన మూళికలతో కూడాని పార్కును ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి.