ప్రణబ్ ముఖర్జీకి ‘భారత రత్న’ పురస్కారం!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల 8న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అందుకోబోతున్నారు. ఆయనతోపాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలకు కూడా వారి మరణానంతరం ‘భారత రత్న’ పురస్కారాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో […]

ప్రణబ్ ముఖర్జీకి ‘భారత రత్న’ పురస్కారం!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 29, 2019 | 6:52 AM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల 8న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అందుకోబోతున్నారు. ఆయనతోపాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలకు కూడా వారి మరణానంతరం ‘భారత రత్న’ పురస్కారాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో కొనసాగిన ఆయన కేంద్రంలో రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, న్యాయ శాస్త్రంలో డిగ్రీలు పొందారు.

1935 డిసెంబరు 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలపాటు రాజకీయ రంగంలో ఉంటూ దేశానికి సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. 1973లో తొలిసారి ఇందిరా గాంధీ మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టారు. పీ వీ నరసింహా రావు ప్రభుత్వంలో 1991లో ప్రణబ్ ముఖర్జీని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు.

హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...