AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG LAWCET 2026: అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. లాసెట్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

TG LAWCET and TG PGLCET 2026 Notification Released: తెలంగాణలో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యాయశాస్త్ర కోర్సులైన 3/5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM ప్రవేశాల కోసం TG లాసెట్, TG పీజీ లాసెట్ 2026-27 నోటిఫికేషన్ విడుదలయింది. ఫిబ్రవరి 10 నుండి దరఖాస్తులు ప్రారంభం కానున్నట్టు ఉస్మానియా వర్సిటీ పేర్కొంది. ఇక మే 12 హాట్‌ టికెట్స్, మే 18న పరీక్షలు జరగున్నట్టు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

TG LAWCET 2026: అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. లాసెట్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
Tg Lawcet 2026 27 Notification
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 5:05 PM

Share

తెలంగాణలో న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను టీజీ లాసెట్ (TG LAWCET), టీజీ పీజీ లాసెట్ (TG PGLCET) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీయే ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 3 ఏళ్ల ఎల్.ఎల్.బి, 5 ఏళ్ల ఎల్.ఎల్.బి కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్.ఎల్.ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే:

తెలంగాణ లాసెట్‌కు సంబంధించి ఫిబ్రవరి 8, 2026న నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 10 తేదీ నుంచి ఈ పరీక్ష ప్రేవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం కానున్నాయని.. అలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మే 3 నుంచి 8 వ తేదీ వరకు దరఖాస్తులో ఏవైనా సవరణలు ఉంటే చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మే 18న పరీక్ష జరగనుందని.. మే 12 నుంచే హాట్‌ టికెట్లు అందుబాటులో ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు:

  • TG LAWCET (3-YDC అండ్ 5-YDC): సాధారణ అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ/ఎస్టీ అండ్ పీహెచ్ అభ్యర్థులకు రూ. 600.
  • TG PGLCET (LL.M): సాధారణ అభ్యర్థులకు రూ. 1100, ఎస్సీ/ఎస్టీ అండ్ పీహెచ్ అభ్యర్థులకు రూ. 900.

అయితే మే 18న జరిగే ఈ పరీక్షలు మొత్తం మూడు సెషన్లలో నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 3 ఇయర్స్ కోర్సు కోసం మొదటి సెషన్ ఉదయం 09:30 నుండి 11:00 వరకు ఉంటుందని.. రెండవ సెషన్ మధ్యాహ్నం 12:30 నుండి 02:00 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. 5 ఇయర్స్ కోర్సు అండ్ LL.M అభ్యర్థులకు సాయంత్రం 04:00 నుండి 05:30 వరకు పరీక్ష నిర్వహించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత మే 23న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 5న తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. అర్హత గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tsche.ac.in సందర్శించవచ్చని తెలిపారు

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!