AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam district: చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌ డయాబెటిస్‌… కలకలం రేపిన 7వ తరగతి విద్యార్ధిని మృతి

జువెన్ డయాబెటిక్‌తో బాలిక మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.. పుట్టుకతో వచ్చిన షుగర్ వ్యాధితో బాధపడుతూ ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతిచెందింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 

Prakasam district:  చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌ డయాబెటిస్‌... కలకలం రేపిన 7వ తరగతి విద్యార్ధిని మృతి
Srivalli
Fairoz Baig
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 05, 2025 | 2:23 PM

Share

ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్ధిని శ్రీవల్లి హఠాత్మరణం చెందింది. అందుకు కారణం డయాబెటిస్‌గా వైద్యులు గుర్తించడంతో కలకలం రేగింది. జంగంగుట్ల గ్రామానికి చెందిన 12 సంవత్సరాల శ్రీవల్లి చిన్నతనం నుంచే టైప్‌ 1 మధుమేహం వ్యాధి బారిన పడింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీవల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది.. మృతి విషయాన్ని తెలుసుకున్న జిల్లా మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని శ్రీవల్లి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలయినా సరే టైప్‌ 1 డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందని, తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు…

ప్రకాశంజిల్లా జంగంగుంట్ల గ్రామంలోని శ్రీవల్లి పుట్టుకతోనే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెట్స్ మిలిటస్(ఐడీడీఎం-షుగర్) సమస్య ఉంది. దీన్నే జువెన్ డయాబెటిక్ అని అంటారని వైద్యులు తెలిపారు. చిన్నతనంలోనే ఈ వ్యాధి వచ్చిన శ్రీవల్లి చికిత్స తీసుకుంటోంది. రోజూ ఆమెకు ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల శ్రీవల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కంభంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు… అక్కడ చికిత్సపొందుతూ శ్రీవల్లి మృతిచెందింది… సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు జంగంగుంట్ల గ్రామంలో పర్యటించారు. మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామాల్లో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

చిన్నారులకు వైద్య పరీక్షలు తప్పనిసరి…

చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఆశ్రద్ద చూపకుండా చిన్నతనం నుంచే అన్ని వైద్య పరీక్షలు చేయిస్తుంటే ఎలాంటి వ్యాధికైనా తొలినాళ్ళలోనే చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు. నీరసంగా ఉండే చిన్నారులు, తీవ్ర అలసటకు గురయ్యే వారిని గుర్తించి డయాబెటిక్ ఉందా లేదా అని పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు… చిన్నారుల్లో తొలినాళ్లలోనే వ్యాధులను గుర్తించి సరైన చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చేయవచ్చంటున్నారు… టైప్‌ 1 డయాబెటిస్‌తో మృతి చెందిన బాలిక శ్రీవల్లి జంగంగుట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నందున శ్రీవల్లి చదివిన పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. మెడికల్‌ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..