AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్ ఫుల్ స్టోరీతో రానున్న ‘సలార్’.. మరోసారి ప్రభాస్‌ను అలా చూపించనున్న కేజీఎఫ్ డైరెక్టర్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు డార్లింగ్.

పవర్ ఫుల్ స్టోరీతో రానున్న 'సలార్’.. మరోసారి ప్రభాస్‌ను అలా చూపించనున్న కేజీఎఫ్ డైరెక్టర్
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2020 | 9:59 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ లో తన పార్ట్ ను పూర్తి చేసాడు డార్లింగ్. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించాడు. దీంతో ‘సలార్’ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ప్రభాస్ ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించనంత పవర్ ఫుల్ గా చూపించనున్నాడట ప్రశాంత్ నీల్. గత సినిమాల మాదిరిగానే ప్రభాస్ సినిమాలో కూడా తన మార్క్ ను చూపించనున్నాడు ప్రశాంత్. ‘సలార్’ అంటే కమాండర్ చీఫ్ అని అర్థం. దాంతో ప్రభాస్ సినిమాలో గ్యాంగ్ కు లీడర్ గా కనిపించనున్నాడని అర్ధమవుతుంది. గ్రూప్ వెనకాల ఉండేవాడు లీడర్ గా ఎలా మారతాడు.. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనే కథతోనే ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. గతంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాలో ఇదే తరహా పాత్రలో నటించాడు డార్లింగ్ . ఇప్పుడు ప్రశాంత్ కూడా ప్రభాస్ ను లీడర్ గా చూపించబోతున్నాడట. ఇక ‘సలార్’ లో రివెంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు