సోమనాథ్ ట్రస్టీ భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ

సోమనాథ్ ట్రస్టీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమనాథుడి ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన ట్రస్టు సభ్యులతో చర్చించారు.

సోమనాథ్ ట్రస్టీ భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 01, 2020 | 8:31 AM

సోమనాథ్ ట్రస్టీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమనాథుడి ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన ట్రస్టు సభ్యులతో చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో పాల్గొన్నామని, ఆలయ అభివృద్ధితో పాటు స్థానిక పరిస్థితులు, సామూహిక పూజలు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు.

భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ లోని సోమనాథ్ మందిరం. దేశంలోని పురాతన శివాలయం కావడంతో నిత్యం వేలాది మంది శివ భక్తులచేత పూజలందుకుంటుంది. ఈ ఆలయం సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగుతుంటుంది. సోమనాథ్ మందిరం పర్యాటక ప్రాంతంగాను ఎంతో గుర్తింపుపొందింది. ఈ మందిరాన్ని 1951లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించారు. 1995లో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఈ మందిరాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి శివ భక్తులచేత విశేష పూజలందుకుంటుంది. ఈ ఆలయ అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై ప్రధాని ఆలయ కమిటీకి పలు సూచనలు చేశారు. పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ప్రధాని దిశానిర్ధేశం చేశారు.