AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ది కీలక పాత్ర : ప్రధాని మోదీ

ఘజియాబాద్: స్వతంత్ర భారతదేశ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సెంట్రల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ 50వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘజియాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఐఎస్‌ఎఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. సీఐఎస్‌ఎఫ్ విజయాలు ఎంతో ప్రధానమన్నారు. మన పొరుగుదేశం శత్రువుగా, యుద్ధంలో పోరాడే శక్తి లేనప్పుడు అంతర్గతంగా ఎన్నో కుట్రలకు పాల్పడతదన్నారు. ఉగ్రవాదం బహుముఖ రూపాల్లో విస్తరిస్తుందన్నారు. ఈ […]

భారత్ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ది కీలక పాత్ర : ప్రధాని మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2019 | 3:40 PM

Share

ఘజియాబాద్: స్వతంత్ర భారతదేశ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సెంట్రల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ 50వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘజియాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఐఎస్‌ఎఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. సీఐఎస్‌ఎఫ్ విజయాలు ఎంతో ప్రధానమన్నారు. మన పొరుగుదేశం శత్రువుగా, యుద్ధంలో పోరాడే శక్తి లేనప్పుడు అంతర్గతంగా ఎన్నో కుట్రలకు పాల్పడతదన్నారు. ఉగ్రవాదం బహుముఖ రూపాల్లో విస్తరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడటం సవాళ్లతో కూడుకున్న అంశం అన్నారు. వ్యక్తులను కాపాడటం సులువే కానీ సంస్థలను కాపాడటం కష్టమని ప్రధాని పేర్కొన్నారు. కష్టకాలంలో అంతర్గతంగా, విదేశాల్లో సీఐఎస్‌ఎఫ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.