మోదీ కొత్త కేబినెట్‌లో వీరికే చోటు..?

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకునే క్రమంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగింటిలో ఏదో ఒక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా […]

మోదీ కొత్త కేబినెట్‌లో వీరికే చోటు..?
Follow us

|

Updated on: May 25, 2019 | 7:13 AM

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకునే క్రమంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగింటిలో ఏదో ఒక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెస్ట్ బెంగాల్ నుంచి గెలిచిన వారికి కూడా మంత్రివర్గంలో కీలక శాఖలు అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్‌లో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు ఎన్నికల ప్రచార సమయంలో పలు అల్లర్లు కూడా చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

అటు ఆర్ధిక శాఖ పదవికి ఈసారి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. గతంలో అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగోలేనప్పుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి జైట్లీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఏ శాఖ అప్పగించాలి అనేదాన్ని నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట పార్టీ పెద్దలు.

కాగా నిర్మలా సీతారామన్, అమేథి నుంచి రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి ఇరానీ, రాజ్ నాధ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర సింగ్ తోమర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్‌లకు ఖచ్చితంగా కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో