ఇస్రో శాస్త్రవేత్తలూ ధైర్యం కోల్పోవద్దుః నరేంద్ర మోదీ

జాబిల్లి అందినట్లే అంది చేతుల్లో నుంచి చేజారిపోయింది. చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్‌కు అంతరాయం కలిగింది. దీనితో ఇస్రో సెంటర్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఆ సమయంలో ప్రధాని మోదీ… అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్వంగా ఫీల్ అవుతోందని ఆయన అన్నారు. మీది చిన్న అచీవ్‌మెంట్ కాదన్న ఆయన.. ఎప్పుడూ కూడా ది బెస్ట్ ఇచ్చి […]

ఇస్రో శాస్త్రవేత్తలూ ధైర్యం కోల్పోవద్దుః నరేంద్ర మోదీ
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2019 | 5:44 AM

జాబిల్లి అందినట్లే అంది చేతుల్లో నుంచి చేజారిపోయింది. చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్‌కు అంతరాయం కలిగింది. దీనితో ఇస్రో సెంటర్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఆ సమయంలో ప్రధాని మోదీ… అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్వంగా ఫీల్ అవుతోందని ఆయన అన్నారు.

మీది చిన్న అచీవ్‌మెంట్ కాదన్న ఆయన.. ఎప్పుడూ కూడా ది బెస్ట్ ఇచ్చి దేశం గర్వపడేలా చేశారని శాస్త్రవేత్తలకు కితాబు ఇచ్చారు. ఎన్నో రోజుల కృషి నీరుగారడంతో దిగులుగా ఉన్న శాస్త్రవేత్తల్లో మోదీ జోష్ నింపే ప్రయత్నం చేశారు. తాను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని వారికి హామీ ఇచ్చారు. ప్రయత్నాన్ని మధ్యలో ఆపకుండా ధైర్యంగా ముందుకు వెళ్దామన్నారు. మిష‌న్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన విద్యార్థుల‌తోనూ మోదీ మాట్లాడారు. విద్యార్థులు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.