సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, ఐసీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడమే కాకుండా… ఈ మేరకు ఆయా బోర్దులకు ఆదేశాలు జారీ చేయాలంటూ మమతా శర్మ అనే లాయర్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను జూన్ 1న ఖరారు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. అయితే ఇప్పుడు సోమవారం సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పు ఆధారంగా పరీక్షలపై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అటు రాష్ట్రాల బోర్డులు కూడా సుప్రీం తీర్పుతో 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్షలను జూలై 15 నుంచి ఆగష్టు 28 వరకు నిర్వహించాలని భావిస్తోంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు రెండు ప్రతిపాదనలను సూచించింది. మొదటిది ముఖ్యమైన సబ్జెక్ట్‌లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని.. రెండోది అన్నింటికీ పరీక్షలు నిర్వహించి.. పరీక్షా సమయాన్ని మాత్రం 90 నిమిషాలకు తగ్గించాలని తెలిపింది.
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!