Petrol Prices May Cut Down: అలా చేశారంటే.. లీటర్ పెట్రోల్ ధర రూ. 75 అవుతుంది.! ఇంతకీ సాధ్యమేనా!!
Petrol Prices Cut Down: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో..
Petrol Prices Cut Down: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పెట్రోల్ రూ. 100 మార్క్‌ను కూడా దాటేసింది. దీనితో ప్రజల జేబులకు చిల్లుపడుతోంది. అయితే చమురు ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల తొలగించి.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75కి.. డీజిల్ ధర రూ. 68కి దిగుతుందని ఆర్ధిక వేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు అది సాధ్యపడుతుందా.!!
పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న వ్యాట్, పన్నులే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు. అందుకే వాటిని తొలగించి జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయట్లేదు. దీని వల్ల దాదాపు రూ. లక్ష కోట్ల మేర నష్టాలు వాటిల్లుతాయని అంచనా. ఒకవేళ ఈ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. అత్యధికంగా 28 శాతం పన్ను విధించాల్సి ఉంటుంది. అలా జరిగితే.. రూ. 30 వరకు తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 75కి, డీజిల్ రూ. 68కి చేరుతుందని ఆర్ధిక వేత్తల అంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ ధరలకు తగ్గట్టుగా రోజువారీ ధరల్లో మార్పులు చేయకుండా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయని ఆర్థికవేత్తలు తెలిపారు.
Also Read:
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!
Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!