Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలపై లాక్ డౌన్ ఎఫెక్ట్.. మన నగరంలో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి..

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్నపాటి మార్పులు కనిపిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో...

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలపై లాక్ డౌన్ ఎఫెక్ట్.. మన నగరంలో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి..
Petrol And Diesl
Follow us
Sanjay Kasula

|

Updated on: May 15, 2021 | 7:08 AM

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్ప మార్పు కనిపించాయి.  మరో వైపు ఎటు తిరిగితే కరోనా మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ప్రజలు కట్టడిలో ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప  బయట తిరగడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని రంగాలూ ఏప్రిల్ నెలలో గట్టి తిరోగమన ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఇక ఎక్కడా ప్రజల ప్రయాణాలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.97గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 90.43గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.12 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.90.56 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 96.40గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.81 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.70గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.47ఉండగా.. డీజిల్ ధర రూ.90.89 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.52 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 98.64కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 92.53 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 97.67 ఉండగా.. డీజిల్ ధర రూ.90.39గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.38లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92.24 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.14 గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.07గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.64లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.92.53 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.34గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.95 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.65కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.11 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.44 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.79గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.17 ఉండగా.. డీజిల్ ధర రూ.87.90గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.94 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.08ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.21 గా ఉంది.

ఇవి కూడా చదవండి:

Young Tiger Junior NTR: పాన్ ఇండియా స్టార్ డమ్ ను పట్టించుకోని తారక్.. హాలీవుడ్ సినిమాకు సిద్దమైనట్టేనా..