Coronavirus Pandemic: కరోనా కాలంలో పెరిగిన ఆన్‌లైన్ బాధితులు.. స్మార్ట్ ఫోనే ప్రపంచంగా బతుకులు..
Coronavirus Pandemic: కరోనా వల్ల అందరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
Coronavirus Pandemic: కరోనా వల్ల అందరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌కి అలవాటు పడిపోయారు. ప్రతి పనిని ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. తాజాగా వినియోగదారులలో ఆన్‌లైన్ ప్రవర్తనను సమీక్షించడానికి సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టన్ లైఫ్‌లాక్ ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భారతీయులు ఆన్‌లైన్‌కి ఎక్కువగా అడిక్ట్ అయినట్లు తేలింది.
ఈ ఆన్‌లైన్ అధ్యయనంలో 1,000 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. వారిలో ప్రతి 10 మందిలో ఎనిమిది మంది డిజిటల్ స్క్రీన్‌ల ముందు గడిపే సమయం గణనీయంగా పెరిగిందని తేల్చారు. సగటున భారతదేశంలో ఒక వినియోగదారు డిజిటల్ స్క్రీన్ ముందు రోజుకు 4.4 గంటలు గడుపుతున్నాడన్నారు. సర్వేలో పాల్గొన్న భారతీయులలో 84 శాతం స్మార్ట్ ఫోన్‌లలో గడుపుతున్నారని తేలింది. మెజారిటీ భారతీయులు స్క్రీన్ ముందు గడపటం వల్ల వారి శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆన్‌లైన్ నిర్వాహకులు తెలిపారు. 76 శాతం మంది స్నేహితులతో గడపడం వంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా స్క్రీన్‌కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి వ్యక్తి వారి స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. తద్వారా వారి ఆరోగ్యం పాటు వారి పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఉండదు. అలాగే ఆన్‌లైన్ ఎక్కువగా వినియోగించడం వల్ల సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయని ఈ అధ్యయనంలో తేలింది. చాలామంది వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని కోల్పోతున్నారని నిర్దారించారు. తల్లిదండ్రులు దీని గురించి తెలుసుకోవడం, సైబర్ సెక్యూరిటీ ఆవశ్యకత గురించి తమ పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సూచించారు.