‘అల’కు పొగడ్త.. ‘సరిలేరు’పై మౌనం.!

వరుస విజయాలు మెగా కాంపౌండ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సూపర్ హిట్స్ అందుకున్న సంగతి విదితమే. ఇక వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గులాబీలతో పాటుగా ఓ లేఖను కూడా రాసి పంపించారు. అయితే ఇప్పటివరకు చిరంజీవి-రామ్ చరణ్ సినిమాలకు మాత్రమే ఈ విధంగా స్పందించిన జనసేనాని.. బన్నీ-సాయితేజ్‌లకు ఇంతగా రియాక్ట్ కావడంతో ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ అయింది. ఇక […]

'అల'కు పొగడ్త.. 'సరిలేరు'పై మౌనం.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 17, 2020 | 5:53 AM

వరుస విజయాలు మెగా కాంపౌండ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సూపర్ హిట్స్ అందుకున్న సంగతి విదితమే. ఇక వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గులాబీలతో పాటుగా ఓ లేఖను కూడా రాసి పంపించారు. అయితే ఇప్పటివరకు చిరంజీవి-రామ్ చరణ్ సినిమాలకు మాత్రమే ఈ విధంగా స్పందించిన జనసేనాని.. బన్నీ-సాయితేజ్‌లకు ఇంతగా రియాక్ట్ కావడంతో ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ అయింది.

ఇక మెగా అభిమానులు ఇలాంటి సన్నివేశాన్ని చూడటం చాలా రేర్‌గా జరుగుతుంటుంది. ఇదిలా ఉండగా ఈ సంక్రాంతికి ‘వైకుంఠపురం’తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా విడుదలైంది. అది బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. కానీ మహేష్‌కు మాత్రం పవన్ విషెస్ చెప్పలేదు.

బన్నీకి శుభాకాంక్షలు చెప్పి.. మహేష్‌ను మర్చిపోవడం ఏంటని..? బిజీ షెడ్యూల్స్ వల్ల మర్చిపోయారా.? అనే చర్చ ఇరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య నడుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే పవన్‌కు మహేష్‌తో స్నేహం ఎలాగూ ఉంది కాబట్టి సినిమా చూశాక రెస్పాండ్ అవుతారేమో అన్నది వేచి చూడాలి. కాగా, పవన్ కళ్యాణ్ పింక్ తెలుగు రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.