అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయించిన పవన్!

అమరావతిలోని పవన్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడికి అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించారు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున మందడానికి పవన్‌ వెళ్లేందుకు నిరాకరించారు పోలీసులు. దీంతో.. పవన్ కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే.. నడుచుకుని మందడం వెళ్తోన్న పవన్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. సీఎం కాన్వాయ్ […]

అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయించిన పవన్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 31, 2019 | 4:21 PM

అమరావతిలోని పవన్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడికి అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించారు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున మందడానికి పవన్‌ వెళ్లేందుకు నిరాకరించారు పోలీసులు. దీంతో.. పవన్ కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అయితే.. నడుచుకుని మందడం వెళ్తోన్న పవన్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పావు గంట పాదయాత్ర ఆపాలని పవన్‌ను కోరారు పోలీసులు. దీంతో వెంకటాపాలెం వద్ద రోడ్డుపై బైటాయించారు పవన్. మందడం శివార్లలో మరోసారి పవన్‌ను అడ్డుకున్న పోలీసులు. పోలీసులు తీరుపై జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ.. ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అప్పుడు మాట్లాడకుండా.. ఇప్పుడు మూడు రాజధానులంటూ గందరగోళం సృష్టించారని ఆరోపణలు చేశారు పవన్. రాజధాని అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. రాత్రికి రాత్రి ఒక మహానగరాన్ని నిర్మించడం సాధ్యం కాదన్నారు. రాజధాని అంటే కేవలం పరిపాలనా భవనాలు కాదని అన్నారు.

రాజధానిపై అమరావతి రైతుల వాయిస్ ఏంటి? అక్కడి ఆందోళనలకు కారణమేంటి? రాజధానిని అక్కడి నుంచి తరలిస్తే వారికి ఉన్న ఇబ్బందులేంటి? అక్కడి రైతులు ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి అంశాలపై ఆరా తీసేందుకు అమరావతిలో పర్యటించారు పవన్ కల్యాణ్.