AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుల్‌భూషణ్‌ను కలిసేందుకు నో పర్మిషన్.. : పాక్

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. పాక్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను దౌత్యాధికారులు రెండోసారి కలిసేందుకు అనుమతించబోమంటోదంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో సెప్టెంబరు 2న జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఎట్టేకేలకు ఐసీజే ఆదేశాలతో పాక్.. భారత్‌కు కాన్సులర్ అనుమతిచ్చింది. దీంతో భారత దౌత్యాధికారి గౌరవ్‌ అహ్లువాలియా కుల్‌భూషణ్‌ను కలిశారు. దాదాపు రెండు గంటలపాటు గౌరవ్‌ ఆయనతో మాట్లాడారు. అయితే ఆ సమయంలో జాదవ్‌ తీవ్ర […]

కుల్‌భూషణ్‌ను కలిసేందుకు నో పర్మిషన్.. : పాక్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 13, 2019 | 11:31 AM

Share

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. పాక్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను దౌత్యాధికారులు రెండోసారి కలిసేందుకు అనుమతించబోమంటోదంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో సెప్టెంబరు 2న జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఎట్టేకేలకు ఐసీజే ఆదేశాలతో పాక్.. భారత్‌కు కాన్సులర్ అనుమతిచ్చింది. దీంతో భారత దౌత్యాధికారి గౌరవ్‌ అహ్లువాలియా కుల్‌భూషణ్‌ను కలిశారు. దాదాపు రెండు గంటలపాటు గౌరవ్‌ ఆయనతో మాట్లాడారు. అయితే ఆ సమయంలో జాదవ్‌ తీవ్ర ఒత్తిడిలో ఉండటం స్పష్టంగా కన్పించిందని ఆయన వెల్లడించారు. అయితే, దౌత్యాధికారులు రెండోసారి జాదవ్‌ను కలిసే అవకాశం లేదని పాక్‌ విదేశాంగ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైజల్‌ చెప్పారు.

కాగా, గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను 2016 మార్చి 3న బలూచిస్థాన్‌లో అరెస్ట్ చేసినట్లు పాక్ బలగాలు వెల్లడించాయి. ఆ తర్వాత జాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై భారత్ తీవ్రంగా మండిపడింది. పాక్ తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించింది. వ్యాపార నిమిత్తం ఇరాన్‌ వెళ్లిన జాదవ్‌ను పాక్‌ అపహరించిందని భారత్‌ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. అంతేగాక.. పాకిస్థాన్ జాదవ్‌కు కాన్సులర్‌ అనుమతి ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుబట్టింది. జాదవ్‌ను భారత అధికారులు కలిసేలా కాన్సులర్‌ అనుమతి ఇవ్వాలని పాక్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు