పాక్ నుంచి మిడతల దాడి.. గుజరాత్ రైతులకు భారీ నష్టం!
పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటున్న గుజరాత్ పంట పొలాలపై లక్షలాది మిడతలు దాడి చేస్తున్నాయి. ఈ మిడతలు పాకిస్తాన్ నుండి వస్తున్నాయి. స్థానికంగా టిడ్డిస్ అని పిలువబడే మిడతల వల్ల జీలకర్ర, జట్రోఫా, పత్తి, బంగాళాదుంప, పశుగ్రాసం వంటి గడ్డి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు సరిహద్దు జిల్లాలైన బనస్కాంత, పటాన్, కచ్‌లోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆసియాలో భారీ మిడుత దాడి గురించి యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓఓ) […]
పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటున్న గుజరాత్ పంట పొలాలపై లక్షలాది మిడతలు దాడి చేస్తున్నాయి. ఈ మిడతలు పాకిస్తాన్ నుండి వస్తున్నాయి. స్థానికంగా టిడ్డిస్ అని పిలువబడే మిడతల వల్ల జీలకర్ర, జట్రోఫా, పత్తి, బంగాళాదుంప, పశుగ్రాసం వంటి గడ్డి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు సరిహద్దు జిల్లాలైన బనస్కాంత, పటాన్, కచ్‌లోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆసియాలో భారీ మిడుత దాడి గురించి యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓఓ) ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. నాలుగు జిల్లాల్లో, బనస్కాంత ఎక్కువగా ప్రభావితమైంది. ఈ కీటకాలు పగటిపూట ఎగురుతాయి, రాత్రిపూట పొలాలలో స్థిరపడతాయి. ఈ మిడతలను భయపెట్టడానికి డ్రమ్స్ కొట్టడం వంటి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం 11 ప్రత్యేక బృందాలను పంపించింది.