కరోనాకు చెక్ పెట్టిన ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం.. స్ట్రెయిన్ వైరస్ అంతానికి ప్రయోగాలు..!

కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచానికి కోవీషీల్డ్ టీకా అందించిన ఆక్సఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు.. మరో కొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టారు.

  • Balaraju Goud
  • Publish Date - 4:38 pm, Thu, 21 January 21
కరోనాకు చెక్ పెట్టిన ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం.. స్ట్రెయిన్ వైరస్ అంతానికి ప్రయోగాలు..!

Fight Emerging Virus Variants : ఇప్పటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు విరుగుడు మందు కనుగొన్న ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచానికి కోవీషీల్డ్ టీకా అందించిన ఆక్సఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు.. మరోసారి రంగంలోకి దిగారు. కరోనా వైరస్ కొత్త రూపం దాల్చుతూ స్ట్రెయిన్‌ వైరస్‌గా మారుతున్న నేపథ్యంలో కోవీషీల్డ్‌కూ కొత్త రూపం ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

కోవిషీల్డ్ తయారీకి వినియోగించిన సాంకేతికతకు కొద్ది మార్పులను చేయడం ద్వారా టీకాకు సంబంధించి కొత్త వెర్షన్లను రూపొందించేందుకు ఆక్సఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారికి తోడు.. ఇప్పటికే బ్రిటర్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్లు బయటపడ్డాయి. దీంతో కొత్త సవాళ్లను ఎదుర్కొవడానికి ఫ్లాన్ చేస్తున్నారు.

కొత్తరకం టీకా వెర్షన్ల తయారీపై ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధి స్పందించారు. కోవిషీల్డ్ తయారీకి వినియోగించిన సాంకేతికతకు ఎటువంటి మార్పులు చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. కొత్త స్ట్రెయిన్లను నిలువరించే టీకా కొత్త వర్షెన్లకు అనుమతివ్వాల్సిన సందర్భం తలెత్తితే అందుకు ఔషధ నియంత్రణ సంస్థ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా బ్రిటన్‌లోని కరోనా స్ట్రెయిన్‌ను అడ్డుకోగలదని ఇటీవల జరిపిన పరీక్షల్లో వెల్లడైంది.

అయితే, దక్షిణాఫ్రికాలోని స్ట్రెయిన్‌పై ఈ టీకా ప్రభావం ఎంతో తెలుసుకునేందుకు బయో ఎన్ టెక్ సంస్థ విస్తృత అధ్యయనం చేపడుతోంది. త్వరలో దీని ఫలితాలను వెలువరిస్తామని వెల్లడించింది.

Read Also… ఖమ్మం ముఖ్యనేతలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. పార్టీలో నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపు