స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు.. 4 వేల మంది ఆహ్వానితులు!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగే స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు రాయ‌బారులు, అధికారులు, మీడియా సిబ్బందితో

స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు.. 4 వేల మంది ఆహ్వానితులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 6:02 PM

Red Fort Independence Day event: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగే స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు రాయ‌బారులు, అధికారులు, మీడియా సిబ్బందితో కూడిన‌ 4 వేల మందికి పైగా పౌరుల‌ను ఆహ్వానించిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఒక‌వైపు గౌర‌వం, మ‌రొవైపు కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఏర్పాట్లు చేసిన‌ట్లు శుక్ర‌వారం పేర్కొంది. గార్డు ఆఫ్ ఆన‌ర్‌లో పాల్గొనే సభ్యులు ఇప్ప‌టికే క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపింది. ఆహ్వానితులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని సూచించింది.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. హ్యాండ్ శానిటైజ‌ర్లు, మాస్కులు స‌భా ప్రాంగణంలోని వివిధ పాయింట్ల వ‌ద్ద విరివిగా అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు డోర్ ఫ్రేం మెట‌ల్ డిటెక్ట‌ర్స్ ఏర్పాటు అదేవిధంగా ర‌ద్దీని నివారించేందుకు వేర్వేరు మార్గాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. అన్ని ప్ర‌వేశ మార్గాల్లో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ సౌక‌ర్యం, నాలుగు మెడిక‌ల్ బూత్‌ల ఏర్పాటు. ఎర్ర‌కోట లోప‌ల‌, బ‌య‌టి ప్ర‌దేశాల్లో ప్ర‌తీరోజు శానిటైజేష‌న్‌ను చేస్తున్నారంది. అహ్వానితులు మాత్ర‌మే వేడుక‌ల‌కు హాజ‌రు కావాల్సిందిగా తెలిపింది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!