ఎన్నికల ఫలితాలు: విపక్షాల వ్యూహం ఏంటంటే..?

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. అయితే ఎగ్జిట్‌పోల్స్ అన్నీ మళ్లీ ఎన్డీయేదే అధికారమని చెబుతున్నాయి. అయినా విపక్షాలు తమ ఆశలను వదులుకోవడం లేదు. ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్న వారు.. కచ్చితంగా హంగ్ ఏర్పడుతుందనే భావనలో ఉన్నారు. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పార్టీనేతలతో విస్తృత సంప్రదింపులు జరుపుతుండగా.. తాజాగా మరోవైపు ఎన్పీపీ నేత శరద్ పవార్ తటస్థ […]

ఎన్నికల ఫలితాలు: విపక్షాల వ్యూహం ఏంటంటే..?
Follow us

| Edited By:

Updated on: May 23, 2019 | 8:13 AM

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. అయితే ఎగ్జిట్‌పోల్స్ అన్నీ మళ్లీ ఎన్డీయేదే అధికారమని చెబుతున్నాయి. అయినా విపక్షాలు తమ ఆశలను వదులుకోవడం లేదు. ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్న వారు.. కచ్చితంగా హంగ్ ఏర్పడుతుందనే భావనలో ఉన్నారు. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పార్టీనేతలతో విస్తృత సంప్రదింపులు జరుపుతుండగా.. తాజాగా మరోవైపు ఎన్పీపీ నేత శరద్ పవార్ తటస్థ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఫలితాలు అటూ ఇటూ అయినా.. ఫలితాల్లో ఎన్డీయే కూటమి కాస్త వెనుకబడ్డా.. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ కూటమి వ్యూహాలు రచించింది. మరి ఎవరు గెలుస్తారు..? ఎవరు ఢీలా పడతారు..? వీటన్నింటికి మరికొన్ని గంటల్లో సమాధానం రానున్నాయి.